- Home
- Entertainment
- హైదరాబాద్‌లో అకిరానందన్.. ఫార్ములా ఈ రేసింగ్‌లో పవన్ తనయుడు సందడి.. ఆ హైట్ హాట్ టాపిక్..
హైదరాబాద్‌లో అకిరానందన్.. ఫార్ములా ఈ రేసింగ్‌లో పవన్ తనయుడు సందడి.. ఆ హైట్ హాట్ టాపిక్..
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ హైదరాబాద్‌లో సందడి చేశాడు. ఆయన నెక్లెస్ రోడ్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలను వీక్షించేందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు శనివారం ముగిసాయి. అయితే ఇందులో టాలీవుడ్ స్టార్స్, క్రికెటర్లు పాల్గొనడం ఈ రేసింగ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాగార్జున, యష్, రామ్‌చరణ్, నాగచైతన్య, అఖిల్, సిద్దు, దుల్కర్ వంటి వారు పాల్గొన్నారు. అయితే వీరిలో పవన్ తనయుడు అకిరానందన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
అకిరా అందరిలో ఒకరిగా చాలా సింపుల్‌గా జనాల మధ్య తిరగడం వివేషం. ఆరెంజ్ కలర్ టీషర్ట్ ధరించి కనిపించారు. చాలా సింపుల్‌గా నడుచుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఇందులో అకిరా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవడమే కాదు, హైలైట్ అయ్యారు. ఆయన హైట్ స్పెషల్ హైలైట్‌గా నిలిచింది. అందరి కంటే హైట్‌గా కనిపిస్తున్నాడు, దూరం నుంచి కూడా కనిపించేంత హైట్‌గా అకిరా ఉండటం విశేషం. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో హైట్ విషయంలో ప్రభాస్‌ని మించిన వాళ్లు లేరంటారు. కానీ చూడబోతుంటే ఇప్పుడు ప్రభాస్‌ని కూడా మించే హైట్ అకిరా ఉన్నాడని అంటున్నారు. ఇది ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపుతుంది.
మున్ముందు అకిరా నందన్ కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందట. పవన్ తన వారసుడిగా అకిరాని సినిమాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని టాక్. దీంతో ఫ్యాన్స్ ఇప్పట్నుంచి ఆయన్ని హీరోగా ప్రమోట్ చేసే పనికి పూనుకున్నారు. అకిరా ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు. తన హైయ్యర్ స్టడీస్ పూర్తయ్యాక సినిమా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
అభిమాన హీరో తనయుడిని ఇలా సింపుల్‌గా చూడటంతో పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఆయన ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. జూ పవర్ స్టార్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక హీరోల్లో ఆ హైట్‌ని కొట్టేవారే లేరని అంటున్నారు.