నారీ నారీ నడుమ మురారి, పవన్ తో ఇదే సవారి

First Published 29, Mar 2020, 3:34 PM

నారీ నారీ నడుమ మురారీ సినిమా అప్పుడెప్పుడో బాలయ్య హీరోగా వచ్చి హిట్టైంది. అలాగే అంతకు ముందు..ఆ తర్వాత అలాంటి ఇద్దరి హీరోయిన్స్ మధ్య ఇరుక్కున్న హీరో కథను ప్రెజెంట్ చేస్తూ సినిమాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం హై సక్సెస్ ఫుల్. అందుకేనేమో అదే ఫార్ములాను మన సినిమావాళ్లు అరగదీసి అరగదీసి వదిలారు. ఇప్పుడు మరోసారి కొత్త తరహాలో అదే ఫార్ములాను పవన్ ని అడ్డం పెట్టి ప్రయోగించబోతున్నారట. ఆ మేరకు స్క్రిప్టు జరుగుతోందని సమాచారం. ఎవరా డైరక్టర్..ఏమా కథ.

వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన సినిమాల గురించిన వార్తలు నిత్యం మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

నిన్నమొన్నటి వరకు పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్..ఇప్పుడు వరుస సినిమాలతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపద్యంలో ఓ వార్త బయిటకు వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది.

డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది.

ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్స్ చేయబోతున్నారు. పూజ హెగ్డే, శృతి హాసన్ లు నటించబోతున్నారు. అలాగే వీరిద్దరి మధ్యా వచ్చే ఫన్ కూడా ఓ రేంజిలో ఉంటుందంటున్నారు.

పవన్ ఈ సినిమాలోఇంకా పెళ్లికాని మిడిలేజ్ మేన్ గా కనిపిస్తాడని, పెళ్లి కాదని, ఆ పెళ్లి ప్రయత్నాల్లో భాగంగా వీరిద్దరూ పరిచయం అవుతారని..వీళ్లు ఇద్దరు పవన్ తో ప్రేమలో పడతారని అంటున్నారు. అలాగే వీళ్లిద్దరు మధ్య పవన్ కోసం జరిగే పోటీ గమ్మత్తుగా ఉంటుందని చెప్పుతున్నారు.

అలాగే పవన్ పెళ్లికాకపోవటానికి ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుందని అంటున్నారు. అయితే ఆ ప్లాష్ బ్యాక్ లో పవన్ లవ్ స్టోరీ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇవన్నీ రూమర్సా, నిజమా అని తేలాల్సి ఉంది.

పవన్ పరాజయాలకు అడ్డుకట్టవేసి గబ్బర్ సింగ్ తో ఆయన్ని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి తీసుకు వచ్చిన దర్శకుడు నుంచి వస్తున్న చిత్రం కావటంతో ఖచ్చితంగా మంచి అంచనాలే ఉంటాయి.

ఇప్పటికే దిల్ రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్ డైరక్షన్ పింక్ రీమేక్ లో పవన్ లాయర్ గా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.అలాగే  మరో రెండు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

క్రిష్ డైరక్టర్ గా, ఏఎం రత్నం నిర్మాతగా ఓ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా పవన్ తన 28వ చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. అదే హరీష్ శంకర్ తో సినిమా.

హరీష్ శంకర్ సినిమాలో అభిమానులను అలరించే అంశాలు ఎక్కువ ఉంటాయి. వాటినే హైలెట్ చేస్తూంటారు. అలాగే అదిరిపోయే డైలాగులు ఉంటాయి.  గబ్బర్ సింగ్ డైలాగులు ఇప్పటికీ ఫ్యాన్స్ మర్చిపోలేరు.

ఈ సంవత్సరం చివర్లో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని, 2021 వేసవి టార్గెట్ గా షూటింగ్ ఫినిష్ చేసి ముందుకు వెళ్తారని చెప్తున్నారు. అన్ని అనుకున్నట్లు ప్లాన్ ప్రకారం జరగాలంటే ఈ కరోనా ప్రబావం నుంచి ఎంత కాలానికి బయిటపడతామో తెలియాలి.

వకీల్ సాబ్ సినిమా విషయానికి వస్తే..ఇప్ప‌టికే ఈ సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. మిగ‌తా షూటింగ్ పూర్తి చేసే లోపు క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా ఆగింది. సినిమాను మే 15న విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు.  క‌రోనా వైర‌స్ వ‌ల్ల వ‌చ్చిన ఈ గ్యాప్‌ను ‘వ‌కీల్‌సాబ్’ టీమ్ ఉప‌యోగించుకుంటుందట‌.

loader