పవన్ మిగతా అన్నీ పక్కన పెట్టి ఆ సినిమాని స్టార్ట్ చేశాడు..కారణమేంటి?
First Published Dec 21, 2020, 1:39 PM IST
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభమైంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన `అయ్యప్పనుమ్ కోశియమ్` చిత్ర రీమేక్‌ని సోమవారం ఉదయం ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు. ఇందులో త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ వంటి వారు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.

ఇందులో దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ నివ్వగా, అతిథిగా విచ్చేసిన త్రివిక్రమ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) దర్శకుడు సాగర్ కె.చంద్రకి స్రిప్ట్ అందించారు.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇందులో మరో పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నారు. సినిమా ప్రారంభం సందర్భంగా ఆయన కూడా తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?