- Home
- Entertainment
- బిగ్ బాస్ కంటెస్టెంట్ తో ప్రేమలో క్రేజీ హీరోయిన్.. ఇదిగో ప్రూఫ్, ఇద్దరూ దొరికిపోయారు ?
బిగ్ బాస్ కంటెస్టెంట్ తో ప్రేమలో క్రేజీ హీరోయిన్.. ఇదిగో ప్రూఫ్, ఇద్దరూ దొరికిపోయారు ?
బాలీవుడ్ లో బ్యాడ్ లక్ వెంటాడిన హీరోయిన్లలో పరిణీతి చోప్రా ఒకరు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఆమెకు అదృష్టం కలసి రాలేదు. పరిణీతి చోప్రా కెరీర్ లో ఎక్కువగా పరాజయాలే ఎదురయ్యాయి.

parineeti chopra
బాలీవుడ్ లో బ్యాడ్ లక్ వెంటాడిన హీరోయిన్లలో పరిణీతి చోప్రా ఒకరు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఆమెకు అదృష్టం కలసి రాలేదు. పరిణీతి చోప్రా కెరీర్ లో ఎక్కువగా పరాజయాలే ఎదురయ్యాయి. కానీ తన హార్డ్ వర్క్ తో పరిణీతి బాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా ఇప్పటికీ కొనసాగుతోంది.
parineeti chopra
మోడ్రన్ హీరోయిన్స్ కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ పరిణీతి చోప్రాకి ఉన్నాయి. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో హీరోయిన్స్ లవ్ అఫైర్స్ గురించి రూమర్స్ రావడం సహజంగా మారిపోయింది. చాలా మంది హీరోయిన్లు తమ బాయ్ ఫ్రెండ్స్ తో ఘాటు ఎఫైర్ కొనసాగిస్తున్నారు.
parineeti chopra
పరిణీతి చోప్రా ప్రేమ వ్యవహారం గురించి కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా ఎవరూ ఊహించని వ్యక్తితో పరిణీతి ఎఫైర్ లో ఉన్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ప్రూఫ్ లు చూపిస్తునారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. టివి నటుడిగారాణిస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉమర్ రియాజ్.
parineeti chopra
గతంలో ఉమర్ రియాజ్, పరిణీతి ఒకేలా ఉండే టి షర్ట్స్ ధరించారు. చాలా సందర్భాల్లో వీరిద్దరూ ఒకే రకమైన టి షర్ట్స్ ధరించడం విశేషం. దీనితో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ సాగుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఉమర్ రియాజ్ ఫ్యాన్స్ అయితే వీరిద్దరి ఫొటోస్ ని ఎడిట్ చేసి కలసి డిన్నర్ కి వెళ్లినట్లు కూడా సృష్టిస్తున్నారు.
parineeti chopra
అయితే తన ఫ్యాన్స్ ఇదంతా సరదా కోసం చేసారు అని ఉమర్ సోషల్ మీడియాలో తెలిపాడు. ఉమర్ రియాజ్ బిగ్ బాస్ 15లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. అయితే గతంలో అతడికి చాలా ప్రేమ వ్యవహారాలు ఉండేవి. ఇప్పుడు నెటిజన్లు అతడిని పరిణీతి చోప్రా తో ముడిపెడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
parineeti chopra
పరిణితి చోప్రా సోషల్ మీడియాలో అందాలు ఒలక బోస్తూ అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. కొన్ని చిత్రాలకు సైన్ చేసి చివరి నిమిషంలో నిర్మాతకు డబ్బులు తిరిగి ఇచ్చేసిన సంఘటన కూడా తన కెరీర్ లో జరిగింది అని పరిణీతి గతంలో తెలిపింది.