ఎన్టీఆర్ టాక్ షో..రెమ్యూనరేషన్ ట్విస్ట్! ఛానెల్ కు షాక్
టీవి ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు ఎన్టీఆర్. ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1తో తెలుగుప్రేక్షకులను అలరించాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో మంచి సక్సెస్ అయింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు తారక్. కాకపోతే కాస్త రిలీఫ్ గా ఉంటుందని గ్యాప్ తీసుకుని, ఎన్టీఆర్ మరోసారి టీవీ షోతో అందరి ఇండ్లలో సందడి చేయనున్నాడట. జెమినీ టీవీలో ప్రసారం కానున్న టాక్ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది.
అందుతున్న సమచారం మేరకు...మీలో ఎవరు కోటీశ్వరుడు లైన్స్ లో ఈ టాక్ షో సాగుతుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటూనే ఈ షో చేయనున్నాడట. ఈ షోకు ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తైందని సమాచారం
అంతేకాదు ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేస్తున్నట్టు టాక్. దీనికోసం రెండు ఫ్లోర్ లను బుక్ చేసుకున్నాడట మేకర్స్. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే ఎన్టీఆర్ ఈసారి ఈ షో నిమిత్తం ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. కాకపోతే.. తానే స్వయంగా డబ్బు పెట్టి నిర్మాత గా టీవీ షో ను ప్రొడ్యూస్ చేయనున్నాడని అంటున్నారు. సాధారణంగా సినిమాల్లో ఇలా జరుగుతూంటుంది. ఇప్పుడు టీవి షోలలోనూ ఈ ట్రెండ్ ని ఎన్టీఆర్ తీసుకురానున్నారు.
దాదాపు అరవై ఎపిసోడ్స్ తో సాగనున్న ఈ షోకు ఎన్టీఆర్ భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని మొదట మీడియాలో టాక్ వచ్చింది. ఒక్కో ఎపిసోడ్ కు రూ.30 లక్షలు చొప్పున మొత్తం రూ.18 కోట్లు తీసుకుంటున్నాడని అన్నారు.
అయితే అంత ఇచ్చుకోలేమని ఛానెల్ వారు చేతులు ఎత్తేయటంతో స్వయంగా ఎన్టీఆర్ నిర్మాత అవతారం ఎత్తి, లాభాల్లో షేర్ తీసుకుంటాడని, ఛానెల్ కు స్లాట్ కొనుక్కునేటట్లు మాట్లాడుకుంటున్నారని వినపడుతోంది. దాంతో ఛానెల్ కు లాభ,నష్టాలతో పని ఉండదు. కానీ ఎన్టీఆర్ యాంకరింగ్ చేసే షో ద్వారా ఖచ్చితంగా పాపులారిటీ వస్తుంది.
ఈ వార్తలు విని తారక్ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. తమ అభిమాన నటుడ్ని మరోసారి బుల్లితెరపై చూడడం కోసం తాము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు.
రియాల్టీ షో కోసంవ్యాఖ్యాతగా మారి బుల్లితెర అభిమానులను అలరించటంతో కొత్త యాంగిల్ చూపించబోతున్నారట.. ఆ షోలో డైలాగులు, పంచులు, కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేయబోతున్నారట. ఖచ్చితంగా ఈ షో కొత్తగా ఉంటుందని అంటున్నారు
ప్రస్తుతం.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు తారక్. అందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా పూర్తవగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. అయితే.. ఈరెండు సినిమాలకు మధ్య దొరికిన ఖాళీ సమయాన్ని టాక్షోకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.