తండ్రి ఒక్కడే కానీ, ఒక తల్లికి జన్మించలేదు... టాప్ స్టార్స్ షాకింగ్ బ్యాక్ గ్రౌండ్స్!
First Published Jan 15, 2021, 12:39 PM IST
పెళ్లి అనేది జీవితంలో ఒక్కరితో ఒకేసారి జరిగే పవిత్ర కార్యం. అయితే అన్ని సందర్భాలలో, అందరి జీవితాలకు ఈ సూత్రం వర్తించదు. చాలా మంది అనేక కారణాలతో రెండో పెళ్లి చేసుకుంటారు. సాధారణ వ్యక్తుల జీవితాలలో ఇది పెద్ద విషయం కానప్పటికీ... సెలెబ్రిటీల విషయంలో జరిగితే అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.

అలా మన టాలీవుడ్ లో కూడా కొందరు స్టార్స్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళ ఇద్దరు భార్యలకు పుట్టిన పిల్లలు స్టార్స్ గా మారడం జరిగింది. అలా చిత్ర పరిశ్రమలో ఒకే తండ్రి, వేరు వేరు తల్లులు కలిగిన స్టార్స్ ఎవరో చూద్దాం..

నందమూరి తారకరామరాజు కుమారులలో ఒకరైన హరికృష్ణ 1973లో లక్ష్మీ అనే యువతిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరి సంతానమే కళ్యాణ్ రామ్. ఐతే 1983లో హరికృష్ణ తాను ప్రేమించిన మరో యువతి షాలినిని రహస్య వివాహం చేసుకున్నారు. షాలిని కి ఒక్కగానొక్క కుమారుడు జూనియర్ ఎన్టీఆర్.

సూపర్ స్టార్ కృష్ణ 1961లో ఇందిరా దేవిని వివాహం చేసుకోగా వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలతో మహేష్ ఒకరు. అయితే కృష్ణ హీరోయిన్ విజయనిర్మలతో కూడా బంధం కొనసాగించారు. విజయ నిర్మల మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం కృష్ణకు దగ్గరయ్యారు. విజయనిర్మల మొదటి భర్త సంతానమే నటుడు నరేష్.

అక్కినేని నాగార్జున సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1984లో ఆయన నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. వీరికి నాగ చైతన్య జన్మించాడు. 1990లో లక్ష్మీతో విడాకుల తరువాత 1992లో నాగార్జున హీరోయిన్ అమలను వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టినవాడే అఖిల్ అక్కినేని.

మోహన్ బాబు మొదటి వివాహంగా మంచు విద్యా దేవిని వివాహం చేసుకున్నారు. అయితే లక్ష్మీ, విష్ణు పుట్టిన తరువాత ఆమె అకాల మరణం పొందారు. విద్యా దేవి మరణం తరువాత ఆమె చెల్లెలు నిర్మలా దేవిని మోహన్ బాబు వివాహం చేసుకున్నారు. వీరి సంతానమే మంచు మనోజ్.

నగ్మా మరియు జ్యోతిక ఇద్దరూ సిస్టర్స్ అన్న విషయం తెలిసిందే. అయితే వీరి తల్లులు మాత్రం వేరు. ఫంజాబీ అయిన ఛాన్దేర్ సదనా రెండో భార్య సీమ కూతురు జ్యోతిక కాగా, నగ్మా మొదటి భార్య కూతురు.

బోనీ కపూర్ మొదటి భార్య సంతానమే అర్జున్ కపూర్. మొదటి భార్యతో విడాకుల తరువాత బోనీ కపూర్ 1996లో శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు కాగా పెద్ద అమ్మాయి జాన్వీ కపూర్.

పవన్ కళ్యాణ్ బద్రి మూవీ సమయంలో హీరోయిన్ రేణూ దేశాయ్ కి దగ్గరయ్యారు. అనంతరం వీరు పెళ్లి చేసుకోవడం జరిగింది. అకీరా నందన్ ఆద్య వీరికి పుట్టిన పిల్లలు. ఆమెతో విడాకుల తరువాత పవన్ రష్యా యువతి అన్నా లెజినోవా ను వివాహం చేసుకున్నారు. వీరికి మార్కోవిచ్ శంకర్ అనే కుమారుడు మరో కుమార్తె ఉన్నారు.

సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ అమృతా సింగ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్, అబ్రహం ఇద్దరు పిల్లలు. హీరోయిన్ కరీనా కపూర్ ని రెండో వివాహం చేసుకున్న సైఫ్ కి తైమూర్ మరో సంతానంగా ఉన్నాడు.
