వైరల్: 'బాహుబలి' భామ ఫొటోషూట్ సూపర్ హాట్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'బాహుబలి- ది బిగినింగ్' సినిమాలో 'మనోహరి' పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ పాటలో టెంపరేచర్ పెంచుతూ..కుర్రకారుకు కిక్ ఇస్తూ.. మతిపోయేలా డ్యాన్స్ చేసిన నటి నోరా ఫతేహి. నాజూకు నడుమొంపుల్ని ఒడుపుగా తిప్పుతూ అటు అందాల అరబోతను, ఇటు డ్యాన్సింగ్ టాలెంట్‌ను ఒకేసారి ఆవిష్కరించడమే ఐటెమ్ సాంగ్. అయితే ఈ తరహా స్పెషల్ సాంగ్ లలో నర్తించే భామల్లో కొంతమందికి మరో టాలెంట్ కూడా ఉంటోంది. అదే బెల్లీ డ్యాన్స్. కేవలం పొట్టభాగాన్ని మాత్రమే కదుపుతూ.. చూపరుల్ని కట్టిపడేయడం బెల్లీ డ్యాన్సర్స్ స్పెషాలిటీ. అందులో ఆరితేరిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి. ఆమె తన పాటలు, ఆటలు తోనే కాకుండా హాట్ ఫొటోలతోనూ అలజడి చేస్తూంటుంది. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లకు వచ్చే రెస్పాన్సే వేరు. అంతేకాదు తన వంతుగా కరోనా సమయంలో ఆదుకోవటానికి సైతం ముందుకు వచ్చింది. ఆమె ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ ఒక్క సారిగా ఆమె వైపుకు చూసి మెచ్చుకుంటోంది.
మొదటగా ఈ భామ పరిచయమైంది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ మూవీ. ఈ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోనా అంటూ చేసిన డాన్స్‌కు అందరు ఫిదా అయ్యారు.
ఆ తర్వాత తెలుగులో ఈ భామ 'కిక్2', 'లోఫర్', 'ఊపిరి' చిత్రాల్లో ఐటమ్ నంబర్స్‌కు డ్యాన్స్‌లు చేసింది. ఇటూ తెలుగులో చేస్తూనే అటూ హిందీలో కూడా ఇరగదీస్తోంది.
ఆ మధ్యన సల్మాన్ ఖాన్ 'భారత్' సినిమాలో కనిపించింది. అంతేకాకుండా నోరా.. 'స్ట్రీట్ డ్యాన్సర్'లో వరుణ్ ధావన్ సరసన మెరిసింది.ఆమెకు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఏర్పడింది.
తాజాగా ఈ భామ దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారిశుద్య కార్మికుల కోసం పీపీఈ కిట్స్ అందజేయనున్నట్టు ప్రకటించింది.
ఇప్పటికే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పీపీఈ కిట్స్ పంపిణీ చేసింది. త్వరలోనే మిగతా హాస్పిటల్స్‌కు తన వాళ్ల ద్వారా పంపిణీ చేయనున్నట్టు తెలిపింది.
మొత్తంగా హీరోయిన్గా నటించి కోట్లకు కోట్లు తీసుకునే వాళ్లు కూడా ఇలాంటి ఆపద సమయంలో ఎవరిని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. కానీ ఐటెం సాంగ్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తన వంతు బాధ్యతగా పీపీఈ కిట్స్ హాస్పిటల్స్‌కు ఇవ్వాలనే నిర్ణయం మెచ్చుకుంటున్నారు.
నోరా పూర్వీకులు ఒకప్పుడు ఇండియాలోనే ఉండేవారు. ఆ తరువాత కెనడాలో స్థిరపడ్డారు.ఆమె పుట్టిందీ, చదువుకుందీ అక్కడే.
ఆమెకు హిందీతో పాటు అరబిక్కూడా బాగా వచ్చు. సంప్రదాయాలు తూచా తప్పకుండా పాటించే కుటుంబం ఆమెది.
ఇంట్లో డ్యాన్స్ అన్న మాట కూడా బయటకు వినపడకూడదు. అన్ని కండిషన్లు ఉండేవి. సినిమా చూసొచ్చి డ్యాన్స్ చేయాలంటే ఆమె గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని రోజూ అలా అద్దం ముందు నిలుచుని చేసేది.
సినిమాల్లోకి రావటానికి ముందు సల్మాన్ నిర్వహించే బిగ్‌బాస్ టీవి షోలో ఆమె పాల్గొంది. అక్కడ ఆమెను చూసి సల్మాన్ బాలీవుడ్‌కి పరిచయం చేశారు.
హీరోయిన్గా కన్నా ఐటెంసాంగ్స్ మీదే ఎక్కువ దృష్టిపెట్టారు కారణం చెప్తూ... సీరియస్‌గా సాగుతున్న సినిమాలో ఐటెంసాంగ్ పెద్ద రిలీఫ్‌గా ఉంటుంది. అప్పటి వరకూ సీరియస్‌గా ఉండే ప్రేక్షకులు ఐటెంసాంగ్స్‌తో రీఫ్రెష్ అయిపోతారు. ఆ పాటనే కాదు అందులో డ్యాన్స్ చేసిన వారు కూడా వారికి బాగా గుర్తుండిపోతారు అంది.
అలాగే హీరోయిన్గా సినిమా మొత్తం కనిపించినా రానంత పేరు ఒక్క పాటతో వస్తుంది. అందుకే ఇవి చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను అంది.
వీలున్నప్పుడల్లా హీరోయిన్గా కూడా కనిపిస్తున్నాను కదా! మొదట్లో నన్ను కేవలం పాటలకే పరిమితం చేసారన్న బాధ ఉండేది. కానీ, ఇప్పుడా బాధ లేదు. హీరోయిన్లతో సమానంగా నన్నూ, నా పాటలను గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
డాన్స్ ప్రాక్టీస్ గురించి చెప్తూ...నేను అంత మంచి డ్యాన్సర్‌ని కాదు. బెల్లీ డ్యాన్స్ అస్సలు రాదు. కానీ నాకు బెల్లి డ్యాన్స్‌తో మంచి పేరొచ్చింది. ఒక్కో పాటకి కొన్ని గంటల పాటు ప్రాక్టీసు చేసిన రోజులు కూడా ఉన్నాయి అంది.
కొన్ని స్టెప్పులు వేయడం కష్టమనిపించి నిద్రపోని రాత్రులు చాలా ఉన్నాయి. ఒక్కోసారి డ్యాన్స్ చేయడం కన్నా నటించడమే తేలిక అనిపిస్తుంది.
కానీ, పాటల ద్వారానే నేను ప్రేక్షకులకు దగ్గరయ్యాను కనుక కష్టపడి మరీ చేస్తుంటాను. మొదట్లో ఎందుకొచ్చిన కష్టం ఇది అనిపించింది కానీ, ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాను అందామె.
నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అందరి ముందు డ్యాన్స్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ నా డ్యాన్స్‌ను అందరూ ఎంజాయ్ చేస్తుండడంతో సంతోషం అనిపించేది.
అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులేమీ లేవు. సెట్లో ఎంత మందున్నా భయపడను అని చెప్పారామె. డాన్స్ తనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్తుంది.
‘బాల్టా హౌస్’ సినిమాలో ఓ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తున్నప్పుడు స్కిప్ అయి పడిపోయి గాయపడ్డాను. ఆ డ్యాన్స్ స్టెప్పులు మరీ కష్టంగా ఉన్నాయి. గాయపడినా ఆ పాట పూర్తి చేశాను. ఆ తరువాత కొన్ని రోజులు రెస్ట్ తప్పనిసరయింది అంది నోరా.
తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకి ఐటెం గాళ్‌గా బాగా తెలిసిన పేరు... నోరా ఫతేహి! అయితే.. సౌత్ లో నోరూరించే సెక్సీ సాంగ్స్ చేసిన ఈ కెనడియన్ బేబీ.. హిందీలో మాత్రం కొంత మేర పర్ఫామెన్స్‌కు ఛాన్స్ ఉన్న రోల్స్ చేస్తోంది. అయితే బాలీవుడ్లో కూడా ఈ భామది గ్లామర్ బ్రాండే!
కేవలం పొట్టభాగాన్ని మాత్రమే కదుపుతూ.. చూపరుల్ని కట్టిపడేయడం బెల్లీ డ్యాన్సర్స్ స్పెషాలిటీ. అందులో ఆరితేరిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి.