చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుపై బాలయ్య నో రియాక్షన్..వాళ్ళు కూడా మౌనం, ఆయనొక్కడే..
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2006లో పద్మ భూషణ్ అవార్డు పొందిన చిరు ఇటీల రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ విభూషణ్ కూడా దక్కించుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2006లో పద్మ భూషణ్ అవార్డు పొందిన చిరు ఇటీల రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ విభూషణ్ కూడా దక్కించుకున్నారు. నటుడిగా కళా రంగంలో చిరు చేస్తున్న సేవలు, సామజిక కార్యక్రమాలని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి అరుదైన గౌరవం అందించింది.
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించినప్పటి నుంచి చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకులు, నిర్మాతలు, నటులు వరుసగా చిరు నివాసానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్, మారుతి, బుచ్చిబాబు ఇలా చాలా మంది సినీ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.
నాగార్జున, వెంకటేష్ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరంజీవితో విభేదాలు ఉన్న మోహన్ బాబు కూడా శుభాకాంక్షలు చెప్పడం విశేషం. అయితే నందమూరి బాలకృష్ణ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ లేదు. ఎక్కడా ఒక మాట కానీ, పోస్ట్ కానీ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు గురించి స్పందించలేదు.
చిరంజీవికి, బాలయ్యకి మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు. కానీ ఇలాంటి సందర్భంలో పరస్పరం అభినందనలు తెలుపుకోవడం అవసరం అనే వాదన వినిపిస్తోంది. చిరంజీవి ఇతర భాషల నటీనటులతో కూడా ఎంతో సాన్నిహిత్యంతో ఉంటారు. కానీ ఇతర భాష నటుల నుంచి కూడా చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుపై స్పందన కరువైంది.
చిరంజీవికి ఎంతో క్లోజ్ గా ఉండే రజనీకాంత్ కూడా ఎలాంటి పోస్ట్ చేయలేదు. కెరీర్ బిగినింగ్ లో వీళ్ళిద్దరూ కలసి నటించారు కూడా. అలాగే అమితాబ్ బచ్చన్ కి కూడా చిరు మంచి స్నేహితుడు. కానీ బిగ్ బీ కూడా రెస్పాండ్ కాలేదు. అదే విధంగా మోహన్ లాల్ కూడా స్పందించలేదు. వీళ్లంతా ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు.
మరోవైపు మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి మాత్రం చిరంజీవి అభినందిస్తూ ట్వీట్ చేశారు. అయితే మరికొందరు చెబుతున్నది ఏంటంటే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు.. ఫోన్ లో విష్ చేసి ఉండొచ్చు కదా అని అంటున్నారు.