పవన్ స్కెచ్‌కి అన్నకు జాక్ పాట్ ?.. అప్పుడు చిరు.. ఇప్పుడు నాగబాబు
First Published Jan 9, 2021, 2:28 PM IST
నాగబాబు త్వరలోనే ఎంపీ కాబోతున్నాడా? త్వరలోనే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన నాగబాబు ఎంపీ
ఎలా కాబోతున్నాడు? ఆయనకు మంత్రి పదవి ఎలా రాబోతుంది. జనసేన నాయకుడిగా ఉన్న నాగబాబుకి కేంద్ర మంత్రి పదవి ఎలా సాధ్యమవుతుంది?..

అన్న చిరంజీవి `ప్రజారాజ్యం` పార్టీ స్థాపించి కేవలం రెండు పదుల అంకెకే పరిమితమయ్యారు. అధికారం దక్కలేదు. కొన్నాళ్లకి ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి కేంద్ర మంత్రి పదవి కొట్టేశాడు. పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు.

అలాగే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో `జనసేన` పార్టీని స్థాపించారు. గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికారు. కానీ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో మాత్రం తన పార్టీ పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. పవన్ కళ్యాణ్‌తోపాటు, నాగబాబు సైతం నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?