మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శ్రీలీల, ఇక రచ్చ రచ్చే
ఇంతకు ముందు కృతిశెట్టి మాదిరిగానే శ్రీలీల పని కూడా అయిపోయింది అనుకున్నారు చాలామంది. కాని శ్రీలీల అందుకు భిన్నంగా తన రూట్ మార్చేసింది. మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది.
హీరోయిన్ల కెరీర్ ఎప్పుడుఎలా ఉంటుందో చెప్పలేం. స్టార్ హీరోయిన్లు కూడా బ్యాడ్ టైమ్ ను చూడొచ్చు.. అసలు కనిపించకుండా పోయే ప్రమాదం కూడా లేకప్లేదు. పూజా హెగ్డే, కృతీశెట్టి లాంటి వాళ్ళు.. ఈ కోవలోకే వస్తుంటారు. అయితే ఈ లిస్ట్ లోకే శ్రీలీల కూడా చేరుతుంది అనుకున్నారు అంతా కాని తృటిలో తప్పించుకుంది బ్యూటీ.
ప్రస్తుతం మళ్ళీ ఫామ్ లోకి వచ్చేస్తోంది. ఇంతకీ శ్రీలీల ఏం చేస్తోంది. టాలీవుడ్ లో కృతీశెట్టి లాంటి వారు గ్లామర్, యాక్టింగ్ కే పరిమితం అయ్యారు. దాంతో అవకాశాలు సన్నగిల్లాయి.. వరుసగా నాలుగైదు సినిమాలు ప్లాప్అయ్యే సరికి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది కృతీశెట్టి. అయితే శ్రీలీల మాత్రం ఈవిషయంలో చాలా డిఫరెంట్ గా ఆలోచించింది.
Pushpa 2 Sreeleela
అంతే కాదు ఎక్స్ ట్రా టాలెంట్ తో ఇండస్ట్రీలో తన టాలెంట్ కు పదును పెట్టింది. గ్లామర్,యాక్టింగ్, తో పాటు డాన్స్ తో ఆకట్టుకోవడం మొదలు పెట్టింది. మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జీనే తట్టుకుని.. క్రాస్ చేసి డాన్స్ చేసిందంటే.. శ్రీలీల మామూలుది కాదు. మహేష్ బాబు లాంటి లిమిటెడ్ డాన్సర్ తో మడతపెట్టి స్టెప్పులు వేయించింది.
SreLeela
అమ్మో ఈ పిల్ల ఎనర్జీ తట్టుకోవడం కష్టం అంటూ సూపర్ స్టార్ కూడా ఒప్పుకున్నారు. ఇలా డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే చాలా ఉన్నాయి. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరో దగ్గర నుండి మొదలు పెట్టి టైర్ టు హీరోల వరకు చాలా మంది హీరోల తో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ యంగ్ బ్యూటీ.
వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న ఈబ్యూటీ 2024లో మాత్రం కాస్త గ్యాప్ తీసుకుంది. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు. ఆమె ప్రస్తుతం ఎంబీబీస్ చేస్తుంది. ఎంబీబీస్ ఎగ్జామ్స్ ఉండడం వల్లే ఆమె ఈ ఏడాది సరిగ్గా సినిమాలు చేయలేదట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలీలనే వెల్లడించింది. అయితే ఈ ఏడాది ఆమె చేసిన మూడు సినిమాలు ముచ్చటగా హిట్టుకొట్టాయి.
మహేష్ బాబుతో గుంటూరు కారం, బాలయ్య కూతురిగా భగవంత్ కేసరి సినిమాలో నటించిన శ్రీలీల.. ఆతరువాత రీసెంట్ గా రిలీజ్అయిన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో దెబ్బలు పడతయ్ రో ఐటెం సాంగ్ లో కనిపించింది.ఇక నెక్ట్స్ ఇయర రెచ్చిపోడానికి రెడీగాఉందట శ్రీలీల. అందుకు ఇప్పటి నుంచే బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తోందట.
అంతే కాదు కుదిరితే బాలీవుడ్ ఎంట్రీకి కూడా సై అంటోందట శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల నితిన్‌తో రాబిన్‌హుడ్, రవితేజతో మాస్ జాతర, పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇవన్నీ 2025 లోనే రిలీజ్ కాబోతున్నాయి. ఇవి కాకుండా సెట్స్ మీదక వెళ్ళాల్సి సినిమాల్లో నాగ చైతన్య , అఖిల్ రెండు సినిమాలతో పాటు .. నవీన్ పోలిశెట్టితో , సిద్ధు జొన్నల గడ్డ తో మరో రెండు సినిమాలు ఉన్నాయి.
అయితే సిద్దుతో చేసే సినిమాకు కోహినూర్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలకి సంబందించిన అప్డేట్స్ అన్ని కూడా ఒకదాని వెంట ఒకటి రానున్నాయి. మరి అందులో ఎన్ని హిట్ అవుతాయి.. శ్రీలీల స్టార్డమ్ ఎంతవరకూవెళ్తుందో చూడాలి.