- Home
- Entertainment
- నాగచైతన్య దరిద్రం... నిన్న థాంక్యూ, నేడు లాల్ సింగ్ చడ్డా... పాన్ ఇండియా ఆశలు గల్లంతేనా..?
నాగచైతన్య దరిద్రం... నిన్న థాంక్యూ, నేడు లాల్ సింగ్ చడ్డా... పాన్ ఇండియా ఆశలు గల్లంతేనా..?
నాగచైతన్య టైమ్ బాగున్నట్లు లేదు. మొన్నీ మధ్య ధాంక్యూ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆయన మరో సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. అదే లాల్ సింగ్ చడ్డా. ప్యాన్ ఇండియా స్దాయిలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. అమీర్ ఖాన్ సినిమా కాబట్టి ఖచ్చితంగా మంచి ఓపినింగ్స్ ఉంటాయి. సినిమా ఆల్రెడీ ప్రూవెడ్ కంటెంట్. హాలీవు్డ రీమేక్. దాంతో ఈ సినిమాపై ఆశలు బాగా పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేటట్లు కనపడుతోంది. నాగచైతన్య ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే ఇబ్బందుల్లో ఇరుక్కుంది. దాంతో చైతు చాలా టెన్షన్ గా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అసలేం జరిగింది...

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ వీకెండ్ దాటేసరికి డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాకు వస్తోన్న కలెక్షన్స్ కు ట్రేడ్ వర్గాలు విస్తుపోయాయి. ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రానికి 3 కోట్లు మాత్రమే షేర్ మాత్రమే రావడం దారుణం. ఈ సినిమాకు అత్యధిక స్థాయిలో నెగిటివ్ రివ్యూలు కూడా దెబ్బకొట్టాయి అంటున్నారు. నాగచైతన్య తన కెరీర్ లోనే దారుణమైన సినిమా కంటే దారుణమైన కలెక్షన్స్ అందుకోవటం విశేషం. చైతు ఏ సినిమా కూడా ఇంత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదు.
మొదటి నుండీ థాంక్యూపై లో బజ్ ఉన్న విషయం తెల్సిందే. దానికి తగ్గట్లుగానే ఓపెనింగ్ కూడా వీక్ గా ఉంది. అలాగే టాక్ కూడా నెగటివ్ గానే వచ్చింది. శనివారం, ఆదివారం కూడా ఈ చిత్ర వసూళ్లు తక్కువగానే ఉన్నాయి. నాగచైతన్య ఇప్పటివరకు అత్యధిక దారుణమైన సినిమాల్లో యుద్ధం శరణం ఒకటి. కానీ ఆ సినిమా కూడా ఇంతకంటే ఎక్కువ స్థాయిలో మొదటి రోజు ఓపెనింగ్స్ అందుకుంది. చాలా ప్రాంతాల్లో సొంత రిలీజ్ చేసుకున్న దిల్ రాజుకు కనీసం 15 కోట్లు ఈ చిత్రం ద్వారా నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు. విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.
ఇక ఇప్పుడు నాగచైతన్య...ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’లో కనిపించనున్నారు. ఈ నెల 11వ తేదీన విడుదల కానుంది. హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఆమిర్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ప్రమోషన్లలో ఆమిర్ బిజీగా ఉన్నాడు. మరోవైపు దేశంపై గతంలో ఆమిర్ చేసిన వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి ‘లాల్ సింగ్ చడ్డా’ను బహిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ను బాయ్ కాట్ చేయమని నెటిజన్లు పిలుపు ఇస్తున్న సంగతి తెలసిందే. సోషల్ మీడియాలో బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనిపై తాజాగా ఆమిర్ ఓ ఈవెంట్లో స్పందించారు. తన సినిమాను బహిష్కరించవద్దని విజ్ఞప్తి చేశారు.
Image: Official film poster
వాస్తవానికి ఇప్పుడు ఆమిర్ ఖాన్ కొత్తగా ఏమీ మాట్లాడలేదు. కానీ, గతంలో దేశంలో అసహనం పెరుగుతోందంటూ వ్యాఖ్యలు చేశారు. తన మాజీ భార్య కిరణ్ రావ్, పిల్లలు దేశం విడిచి వెళ్లాలని అనుకుంటున్నట్లు… ఇండియా సేఫ్ కాదని భావిస్తున్నట్లు చెప్పారు. అప్పట్లో ఆయన మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మరోసారి ఆ మాటలను గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.
Naga Chaitanya
కరీనా కపూర్ ఖాన్ సైతం గతంలో ఒకసారి ‘మా సినిమాలను చూడమని ఎవరూ ఫోర్స్ చేయడం లేదు’ అని కామెంట్ చేశారు. వాటినీ ఇప్పుడు బయటకు తీశారు. ‘బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ఖచ్చితంగా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న నాగచైతన్యకు ఇది టెన్షన్ కలిగించే విషయమే.
‘నా సినిమాలపై ఇలాంటి ప్రచారాలు జరగడం బాధాకరం. కొందరు నేను ఈ దేశాన్ని ఇష్టపడనని నమ్ముతున్నారు. అందుకు బాధ కలుగుతోంది. వాళ్ల మనసుకు అలా అనిపించి ఉండవచ్చు. కానీ అది అసత్యం. దయచేసి నా సినిమాని బహిష్కరించకండి. నా సినిమా చూడండి’ అని ఆమిర్ విజ్ఞప్తి చేశాడు. అయితే మరి జనం ఎలా స్పందిస్తారో తెలియటం లేదు. ఈ సినిమాపై బాగా నెగిటివ్ నెస్ స్ప్రెడ్ అవుతోంది.
Image: Official film poster
ఈ సినిమా ఏ కారణం వల్ల అయినా ఓపినింగ్స్ రాకపోయినా, సినిమా ఆడకపోయినా ఖచ్చితంగా నాగ చైనత్యపై ఆ ఇంపాక్ట్ ఉంటుందనేది నిజం. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా మార్కెట్ లో కు వెళ్దామనుకున్న చైతుకు మరి ఈ సినిమా ఏ విధమైన రిజల్ట్ ఇస్తుదా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చైతుకు మంచి హిట్ ఇవ్వాలని కోరుకుందాం.