N కన్వెన్షన్ కూల్చివేతకి నాగబాబు ఇండైరక్ట్ గా సపోర్ట్? ఏంటి ట్వీట్ రచ్చ
తాజాగా నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఈ కూల్చివేతను సపోర్ట్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను (N Convention) హైడ్రా టీమ్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అటు సినీ పరిశ్రమలో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మూడున్నర ఎకరాలు తుమ్మడి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా నేలమట్టం చేసింది. అయితే ఈ కబ్జా విషయమై ఏ టాలీవుడ్ హీరో కూడా ఖండిస్తూ ప్రకటన చేయలేదు. అందరూ సైలెంట్ గా ఉండిపోయారు. అలాగని హైడ్రాని సపోర్ట్ చేయలేదు. అయితే తాజాగా నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఈ కూల్చివేతను సపోర్ట్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ నాగబాబు ఏమన్నారు.
Nagababu
టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో.. ఒక్కసారిగా హైడ్రా పేరు మారుమోగిపోయింది. దాంతో ప్రస్తుతం హైడ్రా (HYDRA) అనేది.. టాక్ ఆఫ్ ది సిటీగానే కాకుండా.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేవలం తెలంగాణ వరకే కాకుండా.. పక్క రాష్ట్రాల్లోనూ హైడ్రా గురించి చర్చ నడుస్తోందంటే.. బుల్డోజర్ల ప్రభావం గట్టిగానే పడిందని అంటున్నారు.
అందుకు కారణం.. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ భూములు కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా.. సామాన్యులా, సెలెబ్రిటీలా, రాజకీయ ప్రముఖులా అనేది చూడకుండా.. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా.. అక్రమకట్టడాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తుండటమే అని కొందరు మెచ్చుకుంటున్నారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా ఎలాంటి రాగద్వేషాలకు ఒత్తిళ్లకు తలొగ్గదనే సంకేతం ముఖ్యమంత్రి ఇవ్వాలని చూసినా.. ఈ విషయంపై అసలు వివాదం కూడా మొదలైంది. దీన్ని కొంత మంది స్వాగతిస్తే.. మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. గతంలో అధికారులు అనుమతులిస్తేనే నిర్మాణాలు చేపట్టామని.. నాగార్జున హైకోర్టును కూడా ఆశ్రచించటంతో.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు ఎలాంటి పర్మిషన్ లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు. ఇంత వరకు చర్చ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
Chiranjeevi
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో ...‘N కన్వెన్షన్ బఫర్ జోన్‌లలో నిర్మించిన అనధికారిక నిర్మాణాల ద్వారా సిస్టమ్స్, ప్రాసెస్‌ను స్పష్టంగా తారుమారు చేస్తోంది.. వారి వాణిజ్య కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఎకరా 12 గుంటలను ఆక్రమించిన ఎన్ కన్వెన్షన్, 2 బఫర్ జోన్‌లో ఎకరాల 18 గుంటలు, అనధికారిక నిర్మాణాలను పెంచారు. ఈ కన్వెన్షన్‌కు జీహెచ్ఎంసీ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు.
తమ్మిడికుంట చెరువు, చుట్టుపక్కల మాదాపూర్, హైటెక్స్ పరిసర ప్రాంతాలను అనుసంధానించే నాలాలలో తనిఖీలు చేయని ఆక్రమణల కారణంగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నీటి నిల్వ సామర్థ్యం 50-60% మేర కుంచించుకుపోవడంతో తమ్మిడికుంట చెరువు దిగువ ప్రాంతాలు నిత్యం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ముంపునకు గురవుతున్నాయి.
దిగువ, మధ్యతరగతి ప్రజలకు చెందిన అనేక ఇళ్ళు ఈ దిగువ ప్రాంతాలలో మునిగిపోతున్నాయి. ఫలితంగా వారికి తీవ్ర ఆస్తి నష్టం జరుగుతోంది. నిర్ణీత ప్రక్రియను అనుసరించి, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు తమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు ’ అని ఏవీ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Nagababu
ఇక నాగబాబు ట్వీట్ మేటర్ ఏమిటంటే... వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు రావడం,కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే .. ఇప్పటికైన అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేబట్టిన హైడ్రా కాన్సెప్ట్... Let's appreciate our honorable CM garu for your dare decisions and commendable work. We stand with you in full support. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది,
అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది... కచ్చితంగా... అన్నారు నాగబాబు.
ఈ నాగబాబు ట్వీట్ చదివిన వారంతా ... ఎన్ కన్వెక్షన్ కూల్చివేతను ఆయన సమర్దిస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇండైరక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారంటున్నారు.