మంగళసూత్రం అమ్మి అన్నం పెట్టింది.. ఒక్క సంతకంతో వందల కోట్లు పోయాయి.. నటి సుధ భావోద్వేగం..
సీనియర్ నటి సుధ అమ్మ పాత్రల్లో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. వెయికిపైగా చిత్రాల్లో నటించిన మెప్పించిన ఆమె తన జీవితంలోని కష్టాలను పంచుకుని కన్నీళ్లు పెట్టుకుంది.
నటి సుధ(Actress Sudha) తెలుగు పరిశ్రమలో అమ్మ, అత్త, ఆంటీ పాత్రలకు పెట్టింది పేరు. వంటింట్లో భావోద్వేగాలు పండిస్తూ ఆకట్టుకుంటుంది. తమ పాత్రలు సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాయి. నటిగా ఆమె ఎంతో హైట్స్ చూసింది. కానీ ఫ్యామిలీ జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులను ఫేస్ చేసిందట. డైమండ్ గోల్డెన్ స్ఫూన్‌లో పుట్టిన పెరిగిన తాను తండ్రి అనారోగ్యం కారణంగా అన్నీ కోల్పోయి రోడ్డున పరిస్థితి చవిచూసిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి సుధ(Sudha) తన కష్టాల జీవితాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇందులో నటి సుధ చెబుతూ, తాను డైమండ్ స్ఫూన్‌లో పుట్టి పెరిగిందట. పెద్ద ఇళ్లు, ఇంటినిండా పనివాళ్లు, ముగ్గురు డ్రైవర్లు ఇలా చాలా రాజసంగా తమ చిన్ననాటి జీవితం గడిచేదని చెప్పింది. నలుగురు అబ్బాయిల తర్వాత తాను పుట్టిందట. ఒకే కూతురు కావడంతో ఎంతో గారాభంగా పెరిగిందట. అమృతం అనే అర్థం వచ్చేలా తనకు సుధ అనే పేరుని నాన్న పెట్టాడని చెప్పింది. ఇంట్లోనే ఇరవై తులాల బంగారు నగలు వేసుకుని తిరిగేదట.
కానీ విధి తమపై పగబట్టిందని చెప్పింది సుధ. నాన్నగారు ఆనారోగ్యానికి గురి కావడంతో తమ ఆస్తి అంతా తరిగిపోయిందని చెప్పింది. `తమ్ముడు పుట్టిన కొంత కాలానికే నాన్నకు క్యాన్సర్ అని తెలిసింది. అప్పట్నుంచి ఆస్తి అంతా కరిగిపోయింది. ఆరో తరగతి చదువుకునే సమయంలో అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది. అన్నీ ఉన్న స్థితి నుంచి ఒక్కసారిగా ఏమీ లేని స్థితికి పడిపోయాం` అని ఎమోషనల్ అయ్యింది నటి సుధ.
అయితే అమ్మ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో, తనని యాక్టింగ్ ఫీల్డ్ లోకి తీసుకొచ్చిందట. సినిమాల్లోకి వచ్చాక డబ్బు, పేరు వచ్చాయని, ఏమీ లేని స్థితిలో తమకు దూరమైన బంధువులు మళ్లీ తమ వంక చూడటం స్టార్ట్ చేశారని చెప్పింది. చిన్నతనంలోనే సుఖసంతోషాలతోపాటు ఎన్నో కష్టాలు కూడా అనుభవించామని చెప్పింది.
అయితే మళ్లీ తీవ్రంగా నష్టాలు చవి చూడాల్సి వచ్చిందట. ఢిల్లీలో హోటల్ ప్రారంభించారని, దానికి కారణంగా ఉన్న డబ్బంతా పోయిందని చెప్పింది. ఒక్క సంతకంతో వందల కోట్లు నష్టపోయానని, అప్పుల పాలు కావాల్సి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యింది. అయితే ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడుతున్నామని, కానీ కొడుకు రూపంలో మరో బాధ వెంటాడుతుందని, తన కొడుకు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యాడట. తనతో గొడవ పెట్టుకుని వెళ్లిపోయాడని, ఇప్పటికీ తమతో మాట్లాడటం లేదని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది నటి సుధ. ఇప్పటికే భర్త వదిలేయగా, కొడుకు కూడా దూరం పెట్టడంతో ఒంటరైపోయింది నటి సుధ.
1979 సినిమాల్లో ఉంది నటి సుధ. `శ్రీ వినాయక విజయం` చిత్రంతో ఆమె నట జీవితాన్ని ప్రారంభించింది. ప్రారంభంలో కొన్ని హీరోయిన్ పాత్రలు పోషించింది. `గ్యాంగ్ లీడర్` చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. `సుల్తాన్`, `స్వయంవరం`, `ప్రేమించుకుందాం రా`, `ఘరానా బుల్లోడు`, `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`, `హలో బ్రదర్`, `గణేష్`, `కింగ్`, `బుజ్జిగాడు`, `దిల్`, `నాగ`, `మన్మథుడు`, `నువ్వే నువ్వే`, `స్వాగతం`, `సంతోషం`, `కలుసుకోవాలని`, `మనసంతా నువ్వే`, `నువ్వు నాకు నచ్చావ్`, `నువ్వే కావాలి`, `శ్రీరామదాసు`, `జై చిరంజీవ`, `అతడు`, `కలిసుందాం రా`, `భద్ర`, `సుభాష్ చంద్రబోస్`, `శ్రీరామరాజ్యం`, `తీన్‌మార్`, `మిరపకాయ్`, `ఖలేజా`, `డాన్ శీను`, `దూకుడు`, `బద్రీనాథ్` చిత్రాల్లో నటించింది. అయితే గత కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సుధ. మళ్లీ నటిగా బిజీ అవుతుంది. చిరంజీవి, పవన్, మహేష్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, నితిన్ తోపాటు యంగ్ హీరోల సినిమాల్లోనూ నటించి మెప్పించింది.