- Home
- Entertainment
- కాబోయే భర్తపై మృణాల్ ఠాకూర్ కామెంట్స్, దారుణంగా ట్రోలింగ్.. నేనూ మనిషినే అంటూ ఎమోషనల్
కాబోయే భర్తపై మృణాల్ ఠాకూర్ కామెంట్స్, దారుణంగా ట్రోలింగ్.. నేనూ మనిషినే అంటూ ఎమోషనల్
సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది.
పెద్దగా గ్లామర్ షో చేయకుండానే ఈ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం కొంతమందికే సాధ్యం అవుతుంది. సీతారామన్ తర్వాత మరో అవకాశం కోసం మృణాల్ ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ఈ యంగ్ బ్యూటీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
సెలెబ్రిటీలకు, హీరోయిన్లకు, ఇతర నటీమణులకు సోషల్ మీడియా వల్ల తరచుగా ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. చిన్న తప్పు దొరికినా ట్రోలింగ్ తో ఆడేసుకుంటాయారు. అసభ్య కరమైన కామెంట్స్ తో రెచ్చిపోతారు. కొన్నిసార్లు అనుకోకుండా జరిగిన పొరపాటు వల్ల కూడా హీరోయిన్లు ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. తాజాగా మృణాల్ ఠాకూర్ కి అలాంటి పరిస్థితే ఎదురైంది.
మృణాల్ ఠాకూర్ చాలా రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తన ప్రియుడు లేదా భర్త విషయంలో కామెంట్స్ చేసింది. తాను బాయ్ ఫ్రెండ్ ని కానీ భర్తని కానీ అందం చూసి ఎంపిక చేసుకోను అని తెలిపింది. ఆ తర్వాత కపిల్ శర్మ షోలో కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తనకు ప్రియుడు కానీ కాబోయే భర్త కానీ అందంగా ఉండాలి అని స్టేట్మెంట్ ఇచ్చింది.
mrunal thakur
రెండు విభిన్నమైన వ్యాఖ్యలు కావడంతో నెటిజన్లు మృణాల్ ఠాకూర్ పై మీమ్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఒక మీమ్ లో ఆమె కామెంట్స్ పోస్ట్ చేస్తూ.. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో కపటత్వానికి అర్థం మార్చారు. కపటత్వం అంటే మృణాల్ ఠాకూర్ అంటూ దారుణమైన కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
ఈ ట్రోలింగ్ కి మృణాల్ ఠాకూర్ బాగా హర్ట్ అయింది. తనని ట్రోల్ చేస్తూ క్రియేట్ చేసిన మీమ్ కి రిప్లై ఇస్తూ.. కనీసం నేను అప్పుడు ఎలా ఫీల్ అయ్యాను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాను అని అభిప్రాయం చెప్పాను. మేము కూడా మనుషులమే అని ఇలాంటి వాళ్ళు మరచిపోతున్నారు' అంటూ మృణాల్ ఎమోషనల్ రిప్లై ఇచ్చింది. ఈ ట్రోలింగ్ విషయంలో కొందరు అభిమానులు ఆమెకి మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి వారికి స్పందించకండి.. మీరు అమేజింగ్ పర్సన్ అని కామెంట్స్ చేస్తున్నారు.