Mrunal Thakur : బాలీవుడ్ లో తన పరిస్థితి ఇలా ఉందంట.? మృణాల్ ఠాకూర్ హాట్ కామెంట్స్
టాలీవుడ్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. చక్కటి పాత్రలు పోషిస్తూ అలరిస్తోంది. కానీ బాలీవుడ్ లో మాత్రం తన పరిస్థితి మరోలా ఉందని వాపోయింది.

సౌత్ లో వరుస చిత్రాలతో క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ Mrunal Thakur అలరిస్తున్న విషయంతో తెలిసిందే. కానీ తనకు బాలీవుడ్ లో మాత్రం తనకు ఆశించిన ఫలితం కనిపించడం లేదని భావిస్తోంది.
‘సీతారామం’ చిత్రంతో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. సీతగా, ప్రిన్సెస్ నూర్జహాన్ గా అద్భుతంగా నటించింది. త్వరలో కోలీవుడ్ లోకీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.
ఇలా సౌత్ లో మాత్రం మృణాల్ ఠాకూర్ వరుస ఆఫర్లతో దుమ్ములేపుతోంది. తన కంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో తనకు అందుతున్న ఆఫర్లపై ప్రస్తావించింది.
రీసెంట్ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడింది. బాలీవుడ్ లో తనకు అన్నీ గ్లామరస్ పాత్రలు వస్తూనే తప్ప... మంచి ప్రేమకథ ఉన్న చిత్రాల్లో అవకాశం అందడం లేదని చెప్పుకొచ్చింది. అలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పింది.
బహుశా తనకు ఇంకా బాలీవుడ్ లో ఆ స్థాయి గుర్తింపు, క్రేజ్ లేనందు వల్లే అలాంటి సినిమాలు రావడం లేదేమోనని అభిప్రాయపడింది. అక్కడ మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పింది.
ఇక సౌత్ లో ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ మంచి రెస్పాన్స్ అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది. నెక్ట్స్ మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’తో అలరించబోతోంది.