మోక్షజ్ఞని పక్కన పెట్టి కూతురుతో సినిమా.. బాలకృష్ణ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడేంటి?
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బాలయ్య. కూతురిని రంగంలోకి దించుతున్నాడు.
ఎన్టీఆర్ నటవారసులుగా సినిమా రంగంలోకి వచ్చాడు బాలకృష్ణ. ఎన్టీఆర్ మిగిలిన కొడుకులు సినిమాలు చేసినా బాలయ్యలా సక్సెస్ కాలేకపోయారు. దీంతో నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వీరితోపాటు హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తర్వాతి తరం నటనవారసులుగా రాణిస్తున్నారు. ఇప్పుడు బాలయ్య వారసుడుగా రాబోతున్నాడు.
బాలకృష్ణ.. తన నటన వారసుడిగా కొడుకు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నారు. చాలా నాలుగైదు ఏళ్లుగా దీనికి సంబంధించిన ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. కానీ ఇటీవల మాత్రం మోక్షజ్ఞ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని, ప్రస్తుతం ఆయన అందులో బిజీగా ఉన్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. కొడుకు కాదు, కూతురుని రంగంలోకి దించుతున్నాడు. సినిమా రంగంలోకి ఆయన తన కూతురుని తీసుకురాబోతుండటం విశేషం. ఆయన చిన్న కూతురు తేజస్విని సినిమాల్లోకి తీసుకురాబోతున్నారు. అంతేకాదు ఆమెతో ఓ సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఆమెని నిర్మాతని చేయబోతున్నారు. తాజాగా దానికి సంబంధించిన ప్లాన్ జరుగుతుంది.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో `అఖండ` పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ `అఖండ2` రాబోతుంది. ఈ మూవీతో తన కూతురు తేజస్విని నిర్మాతగా పరిచయంచేయబోతున్నారు బాలయ్య. తేజస్విని చాలా రోజులుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. `అన్ స్టాపబుల్` టాక్ షోని దగ్గరుండి చూసుకుంది. తెరవెనుక చాలా ప్లాన్స్ చేసింది. బాలయ్యకి సపోర్ట్ గా ఉంది. దీంతో ఇప్పుడు నిర్మాతగా పరిచయం కాబోతుందట. `అఖండ 2`తో ఆమె నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం కానుందని తెలుస్తుంది.
మొదట కొడుకు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పట్లో ఆ అప్‌డేట్ వచ్చేలా లేదు. దీంతో కుమారుడిని పక్కన పెట్టి కూతురుతో సినిమా చేయబోతున్నారట బాలయ్య. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత బోయపాటి మూవీ ఉంటుందని సమాచారం.
బాలకృష్ణకి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. నారా బ్రహ్మాణి, తేజస్విని, మోక్షజ్ఞ ఉన్నారు. బ్రహ్మాణి.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తేజస్విని వ్యాపారవేత్త భరత్‌ని పెళ్లి చేసుకుంది. ఇక మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్దమవుతున్నాడట.