MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 50 ఏళ్ళ క్రితం చిరంజీవి ఒరిజినల్ పేరు ఎలా రాశారో చూడండి..రేర్ ఫోటో చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ, పెద్ద కథే

50 ఏళ్ళ క్రితం చిరంజీవి ఒరిజినల్ పేరు ఎలా రాశారో చూడండి..రేర్ ఫోటో చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ, పెద్ద కథే

అభిమానులందరికీ మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుతోనే పరిచయం. చిరంజీవి అనే పేరుకి పరిచయం అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా మెగాస్టార్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే చిరంజీవి సినిమాల్లోకి రాకముందు చిరంజీవి కాదు.. ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 26 2024, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అభిమానులందరికీ మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుతోనే పరిచయం. చిరంజీవి అనే పేరుకి పరిచయం అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా మెగాస్టార్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే చిరంజీవి సినిమాల్లోకి రాకముందు చిరంజీవి కాదు.. ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్. ఇది కూడా చాలా మందికి తెలుసు. 1978 చిరంజీవి ప్రాణం ఖరీదు చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. 

25

అంతకు ముందు నుంచే చిరంజీవికి నటన, డ్యాన్సులు అంటే పిచ్చి. కాలేజ్ డేస్ లోనే చిరంజీవి స్నేహితులతో కలసి నాటకాలు వేసేవారు. ఆ అద్భుతమైన ఒక జ్ఞాపకాన్ని తాజాగా చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి షేర్ చేసిన ఈ ఫోటో ఫ్యాన్స్ కి థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం ఫోటో అది. 

35

చిరంజీవి ఈ ఫోటో గురించి కామెంట్స్ లో పేర్కొన్నారు. తాను 50 ఏళ్ళ క్రితం బి కామ్ చదువుకున్న నర్సాపూర్ వైఎన్ ఎమ్ కాలేజ్ లో దిగిన ఫోటో అట అది. రంగస్థలంపై చిరంజీవి తొలిసారి 'రాజీనామా' అనే నాటకం వేశారట. ఈ నాటకంలో చిరంజీవి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. 1974లో చిరంజీవి బి కామ్ చదువుకున్నారు. అప్పుడే తొలి నాటకం వేశారు. అంటే సరిగ్గా 50 ఏళ్ళు పూర్తయింది. ఇదే విషయాన్ని చిరు ప్రస్తావించారు. 

45

ఆ అవార్డు గెలుచుకోవడం తనకి ఎనలేని ప్రోత్సాహం ఇచ్చింది అని తెలిపారు. అద్భుతంగా ఉన్న ఈ ఫొటోలో చిరంజీవి నూనూగు మీసాల కుర్రాడిగా గ్లాసెస్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఆ ఫోటో కింద చిరంజీవి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నట్లు రాసి ఉంది. అప్పట్లో కొణిదెల శివశంకర్ వరప్రసాద్ ఇంకా చిరంజీవి గా మారలేదు. కాబట్టి అప్పటికి ఆయన పేరు  శివశంకర్ వరప్రసాద్. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఆ ఫోటో పై కాలేజీ యాజమాన్యం.. Mr. K. S. S. V. Prasada Rao, B.com, బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది కాలేజ్ 1974-75 అని రాసి ఉంది. 

55

చిరంజీవి ఒరిజినల్ పేరు, ఫోటో చూస్తూ ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవ్వడం మాత్రమే కాదు.. గూస్ బంప్స్ వస్తున్నాయి అని అంటున్నారు. 50 ఏళ్ళ క్రితం ఉత్తమ నటుడిగా కాలేజ్ లో అవార్డు అందుకున్న చిరంజీవి.. భవిష్యత్తులో సినీ రంగంలో వెలుగు వెలగబోతున్నాడు అనేదానికి పునాది పడింది అక్కడే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అస్సలు ఒప్పుకోలేదు, సినిమాపై అనుమానాలు.. ప్రకాష్ రాజ్ పై వైరల్ కామెంట్స్
Recommended image2
రాఘవేంద్ర రావు నుంచి కోదండరామిరెడ్డి వరకు.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్
Recommended image3
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved