రవితేజ బూతుల గురించి మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్.. ఇండస్ట్రీలో అంత దారుణంగా ఇంకెవరూ మాట్లాడరు
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇతర చిత్రాల పోటీ వల్ల టాలీవుడ్ నిర్మాతలంతా కలసి పోస్ట్ పోన్ అయ్యేలా చేశారు.
దీనితో ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో రవితేజ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉస్తాద్ షోతో మంచు మనోజ్ ఆడియన్స్ ని బాగా అలరిస్తున్నారు. మంచు మనోజ్ హోస్ట్ గా చేస్తున్న ఉస్తాద్ షోకి రవితేజ అతిథిగా హాజరయ్యారు.
ఈ షోలో రవితేజ, మంచు మనోజ్ మధ్య సరదాగా సంభాషణ సాగింది. మంచు మనోజ్ ఓపెన్ గా రవితేజని కొన్ని ప్రశ్నలు అడిగేసాడు. ఈ ప్రశ్నలకు రవితేజ ఇచ్చిన సమాధానం కూడా అంతే ఆసక్తిగా ఉంది. మంచు మనోజ్ మాట్లాడుతూ.. మనిద్దరం మొదటిసారి ఎప్పుడు కలిశాం అన్నయ్య అని అడిగారు.. రవితేజ ఆలోచిస్తుండగా.. నువ్వేమైనా ఫిగారా గుర్తు పెట్టుకోవడానికి అనుకుంటున్నారు కదా అంటూ మనోజ్ ఫన్నీగా అనేసాడు.
అనంతరం మరో ప్రశ్న అడుగుతూ.. ఇండస్ట్రీలో రవితేజ వాడే బీప్ లు (బూతులు) ఇంకెవరూ మాట్లాడరు అంట నిజమేనా అని ప్రశ్నించాడు. రవితేజ కూడా ఓపెన్ గానే సమాధానం ఇచ్చాడు. అందరూ బూతులు మాట్లాడతారు కానీ నేను ఎక్కువగా ఓపెన్ అయిపోతా అంతే తేడా అని బదులిచ్చారు.
ఇండస్ట్రీలో రవిజేతేజ జోవియల్ గా ఉంటారని అందరికి తెలుసు. మంచు మనోజ్ అడిగిన ఈ ప్రశ్నతో బూతులు కూడా ఓపెన్ గానే మాట్లాడతారనే విషయం బయటకి వచ్చింది.
రవితేజ నటించిన గత చిత్రాలు టైగర్ నాగేశ్వర రావు, రావణాసుర బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. దీనితో రవితేజ ఈగల్ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమా ఎలా ఉండబోతోందో అనే ఉత్కంఠ నెలకొంది.