బిగ్ లీక్ : గొడవ అవ్వకుండా, వీడియో కాల్‌లో మహేష్ సెటిల్మెంట్

First Published 30, Mar 2020, 8:58 AM

తన ప్రాజెక్టుని సాఫీగా ముందుకు తీసుకెళ్లటంలో మహేష్ ని మించిన వారు ఇండస్ట్రీలో లేరంటారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే రంగంలోకి దూకి ట్రబుల్ షూటర్ గా మారి, దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం మొదలెడుతూంటాడు. అందుకే మహేష్ తో సినిమా అంటే బిజినెస్ పరంగానే కాక, ఏ తలనొప్పులు లేకుండా నడుస్తుందని నిర్మాతలు నమ్మి ఉత్సాహం చూపిస్తూంటారు. ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి జరిగిందని..మహేష్ గురించి మీడియాలో మాట్లాడుకుంటున్నారు.తాజాగా ఆయన ఓ నిర్మాతకు వీడియో కాల్ చేసి వివాదం పెద్దది అవ్వకుండా సమస్యను మొదట్లోనే సాల్వ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. 

రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్, పరుసరామ్ ల ప్రాజెక్టు ఓకే అయ్యిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ చేయబోయే ప్రాజెక్టు ఇదే. ఈ నేపధ్యంలో అప్పటికే నాగచైతన్యతో ప్రాజెక్టు ఓకే చేసుకుని పరుసరామ్..ముహుర్తం కూడా జరుపుకోవటం సమస్య గా మారింది.

చైతు,పరుసరామ్ ల సినిమా చేద్దామనుకున్న నిర్మాతలు 14 రీల్స్ ప్లస్ వారు...ఈ విషయంలో స్ట్రాంగ్ గా అబ్జెక్షన్ పెట్టారు. తమతో సినిమా ముహూర్తం చేసుకుని, వేరే హీరో, నిర్మాతతో ఎలా చేస్తావమని పరుసరామ్ ని నిలదీసారు.

అడ్వాన్స్ అంటే వెనక్కి తిరిగి ఇవ్వగలను కానీ, మహేష్ వంటి స్టార్ తో సినిమాని ఎలా వదులుకోగలను లబోదిబోమన్నాడు పరుసరామ్. కానీ నిర్మాతలు ఒప్పుకోలేదు. మహేష్ కావచ్చు కానీ ఇధి పద్దతి కాదు కదా..ఇండస్ట్రీ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా అన్నారు. పరుసరామ్ కు ఏం చెప్పాలో తెలియలేదు.

ఈ విషయం మహేష్ కు చేరింది. వెంటనే ఆయనలో ట్రబుల్ షూటర్ నిద్రలేచారు. మహర్షి కు తను అప్లై చేసిన స్కీమ్ నే ఇక్కడా చేసారు. దాంతో ఈ సమస్య వెంటనే ఓ కొలిక్కి వచ్చిందని అందరూ మహేష్ ని మెచ్చుకుంటున్నారు.

మహేష్ చేసిందేమిటంటే...తన డేట్స్ ఉన్న నిర్మాతలు మైత్రీ మూవీస్ వారితో డిస్కస్ చేసాడు. ఆ తర్వాత 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు వీడియో కాల్ చేసారు. ఎందుకంటే ఇప్పుడు కదిలి ఒక చోట నుంచి మరొకచోటకు వెళ్లే పరిస్దితి లేదు.

ఆ వీడియో కాల్ లో ... పరుసరామ్ తో సినిమా చేద్దామని అడ్వాన్స్ ఇచ్చి కమిటయ్యారు కాబట్టి మీరు కూడా ఈ సినిమాలో వాటా తీసుకోండి అని చెప్పి ఒప్పించారు.

మహేష్ వంటి సూపర్ స్టార్ ఫోన్ చేసి చెప్తే నిర్మాతలు ఒప్పుకోకుండా ఉంటారా. సరే అన్నారు. మహేష్ కొత్త ప్రాజెక్టులో షేర్ వచ్చినందుకు సంతోషించారు. అయితే తను చైతు ప్రాజెక్టుని లాగేసుకున్నట్లు గా ఉండకూడదని, దానికి వేరే పరిష్కారం చూడమని మహేష్ చెప్పారు.

దాంతో ఇప్పుడా నిర్మాతలు భాధ్యత ..నాగ చైతన్య ను నొప్పించకుండా ఈ సమస్యను తమ వైపు నుంచి సాల్వ్ చేయటం గా మారింది. చైతుతో ఓ మంచి డైరక్టర్ ని, కథను ఎంపిక చేసి అదే డేట్స్ లో సినిమా ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు చైతుతో డిస్కస్ చేసినట్లు సమాచారం.

ఇలా చేయటం వల్ల  ఇప్పుడు మహేష్ తో ప్రారంభించబోయే సినిమాకు ముగ్గురు నిర్మాతలు వచ్చారు. తన డేట్స్ నిమిత్తం మైత్రీ మూవీస్ వారు, డైరక్టర్ డేట్స్ నిమిత్తం 14 రీల్స్ ప్లస్ వారు కలిసారు. ఎలాగో మహేష్ సొంత బ్యానర్ సైతం ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఇక ఏ బాధా లేదు. పరుసరామ్ నెత్తి మీద పెద్ద బరువు దిగినట్లైంది.

ఇక మహర్షి సమయంలోనూ దర్శకుడు వంశీ పైడిపల్లికి ..పీవీపి నుంచి లీగల్ సమస్యలు వస్తే...వారిని తన పార్టనర్ గా మహర్షి సినిమా కు తీసుకున్నారు. అదే సమయంలో తను సినిమా చేస్తానని గతంలో అశ్వనీదత్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాను..ఆయన్ను పార్టనర్ గా తీసుకున్నారు.

ఇక దిల్ రాజు దగ్గర తను అడ్వాన్స్ తీసుకున్నందుకు ఆయన్ను సీన్ లోకి తెచ్చి..ముగ్గురు నిర్మాతలతో ముచ్చటగా మహర్షి ని సేఫ్ గా లాండ్ చేసారు. ఇప్పుడు కూడా అలాంటిదే చేసాడన్నమాట.

ఈ చిత్రంలో నటించే హీరోయిన్ గా  కీర్తి సురేష్ పేరుని మహేష్ సజెస్ట్ చేసాడట. మహానటి చూసిన దగ్గర్నుంచి మహేష్ కి ఆమెతో కలిసి చేద్దామని ఉంది,ఆమెను పిలిచేటంత పాత్రలు లేక ఆగారట.కానీ పరుసరామ్ చిత్రంలో హీరోయిన్ పాత్ర స్ట్రాంగ్ గా ఉంటుందని ఆమెను సీన్ లోకి తెస్తున్నారట.

loader