MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lata Mangeshkar Biography: అలసి... సొలసి, అమరలోకానికి పయనమైన గాన తరంగం.

Lata Mangeshkar Biography: అలసి... సొలసి, అమరలోకానికి పయనమైన గాన తరంగం.

ఆమె గానం మధురం.. ఆమె గానం సుమధురం.. ఆమె గానం అమరం.. కోట్లాది మంది శ్రోతల చే గాన దేవతగా కీర్తించబడిన ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్(Lata Mangeshkar) ఇక లేదు. సంగీత ప్రియులను.. అభిమానులను కన్నీటి సాగరంలో ముంచి లతాజీ సెలవు తీసుకున్నారు. తారల్లో దృవతారగా ఆకాశాన్ని చేరారు.

4 Min read
Mahesh Jujjuri
Published : Feb 06 2022, 11:03 AM IST| Updated : Feb 06 2022, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115

1929 సెప్టెంబరు 28 న సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా జన్మించిన లతా మంగేష్కర్ అయిదవ ఏటనే సంగీతంపై మక్కువను పెంచుకున్నారు. కె.ఎల్ సైగల్ పాటలకుఆమె వీరాభిమాని. 1942 లో ఆమెకు పదమూడేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాక.. కుటుంబ పోషణ తన మీద పడడంతో లతా మంగేష్కర్ సినీ రంగంలోకి నటిగా, గాయనిగా ప్రవేశించాల్సి వచ్చింది.

215

లతాజీ ముందు నటిగా పరిచయం అయ్యారు. 1942లో పహ్లా మంగళ్ గౌర్ అనే చిత్రంలో నటించి, ఈ సినిమాలోనే పాటలు కూడా పాడారు. తండ్రి మరణం తరువాత  గులాం హైదర్ అనే సంగీత దర్శకుడు లతను తన కన్నబిడ్డగా భావించి, ప్రోత్సహం ఇవ్వడంతో ఆమె నేపథ్యగాయకురాలిగా మంచి పేరు తెచ్చుకుంది.

315

తొలుత జీవన్ యాత్ర, మందిర్ లాంటి సినిమాల్లో పాటలుపాడినా,  ఆ తర్వాత అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలి వంటి సక్కెస్ ఫుల్ సినిమాల్లో సూపర్ హిట్ పాటు పాడి చరిత్రను తిరగ రాశారు.  అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లో లత పాడిన పాటలు ఆమెకు ఒక స్టార్ సింగర్ హోదాను కట్టబెట్టాయి.

415

1950 నుంచి మంగేష్కర్ ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్ల వద్ద పాటలు పాడారు. శంకర్ జై కిషన్, నౌషాద్ అలీ, ఎస్.డి.బర్మన్, పండిట్ అమర్ నథ్, హుసన్ లాల్ భగత్ రాం, సి.రామచంద్ర, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్ హుస్సేన్, రోషన్, కళ్యాణ్ జీ-ఆనంద్ జీ, వసంత్ దేశాయ్, సుధీర్ ఫడ్కే, హన్స్ రాజ్ భేల్, మదన్ మోహన్, ఉషా ఖన్నా వంటి ఉద్దండుల సంగీత సాధ్యంలో కొన్ని వేల పాటలు పాడారు లతాజీ.

515

ఓ సారి లతాజీ పండిట్ నెహ్రూ చేతే తన పాటతో కన్నీళ్లఉ పెట్టించింది. 1963 జనవరి 27లో చైనా-భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ ఎదుట అయే మేరే వతన్ కే లోగోపాట పాడారు లత. సి.రామచంద్ర స్వరపరచిన ఈ పాటను.. కవి ప్రదీప్ రాశారు. ఈ పాట వింటూనే నెహ్రూ కన్నీటి పర్యంతం అయ్యారంట.

615

1970ల నుంచి లతా మంగేష్కర్ కచేరీలు చేయడం ప్రారంభించారు. 1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారానే లతా మంగేష్కర్ తన జీవిత ప్రస్థానంలో కొన్ని వేల కచేరీలు చేసిన లతా జీ.. కొన్ని కచేరీలను స్వచ్చంద్ధ సంస్థల కోసం ఉచితంగా చేసి మంచి మనసు చాటుకున్నారు. సినీ పాటలు పాడుతూనే కచేరీలు కూడా చేసేవారు లత.

715

గాన కోకిల సంగీత ప్రస్థానంలో మరచిపోలేని పాటలెన్నో.. రికార్డ్ క్రియేట్ చేసిన పాటలెన్నో ఉన్నాయి. 1978లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన సత్యం శివం సుందరం సినిమాలో టైటిల్ సాంగ్ ఆ ఏడాదిలోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. 1985లో విడుదలైన సంజోగ్ సినిమాలోని జు జు జు పాట శ్రోతలను సమ్మోహన పరిచింది.  

815

దూరియా సబ్ మితా దో సబూత్ (1980), బైతే బైతే ఆజ్ ఆయీ పతిత (1980), తోడా రెషమ్ లగ్తా హై జ్యోతి (1981), దర్ద్ కీ రాగిణీ ప్యాస్ (1982), కిషోర్ కుమార్ తో పాడిన డ్యుయెట్ నైనో మే సపనా హిమ్మత్ వాలా (1983) వంటివి వారిద్దరి  భాగస్వామ్యంలో వచ్చిన హిట్ పాటలు. శంకర్ జై కిషన్ లాంటి ఆనాటి సంగీత దర్శకుల నుండి నేటి ఎ.ఆర్ రెహమన్ వంటి సంగీత దర్శకుల వరకూ దాదాపు అందరి సినిమాలకు లత పాటలు పాడారు. 

915

తన తరువాత తన చెల్లెలు ఆశా భోస్లే ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు లతా  మంగేష్కర్. ఆశా భోస్లే కూడా లతా అంత క్రేజ్ నుసాధించారు బాలీవుడ్ లో. సౌత్ లో లతా కంటే ఎక్కువ పాటు పాడారు ఆశా. పాటల పరంగా పోటీ ఉన్నా.. అక్కా చెల్లెలు అన్యోన్యంగా ఉండేవారు. చెల్లిని చాలా ఆప్యాయతగా చూసేవారు లతా మంగేష్కర్.

1015

సౌత్ లో ఆమె ఎక్కువగా పాటలు పాడింది తమిళంలోనే..1988లో మంగేష్కర్ వరుసగా తమిళంలో పాటలు పాడారు. ఇళయరాజా సంగీత సారధ్యంలో  ఆనంద్ సినిమాలో ఆరారో ఆరారో పాట  సత్య సినిమాలో వలై ఒసీ పాట పాడారు లత. 1980 వ దశకంలో బప్పీలహరి ఎన్నో ఫాస్ట్ బీట్ సాంగ్స్ ను అందించారు.

1115

తనకు ఎంతో ఆదర్శంగా నిలిచిన గాయకులను మర్చిపోలేదు లతాజీ.. 1994లో లతా మంగేష్కర్ అమర గాయకుల హిట్ పాటలను తన స్వరంలో ఆలపించి. ప్రత్యేకంగా రికార్డ్‌లు విడుదల చేశారు. కె.ఎల్.సైగల్, రఫీ, హేమంత్ కుమార్, ముఖేష్, పంకజ్ మల్లిక్, కిషోర్ కుమార్, గీతా దత్, జొహ్రబాయ్, అమీర్ బాయ్, పరౌల్ ఘోష్, కనన్ దేవి లాంటి లెజండరీ గాయకుల పాటలు పాడి  తనదైన శైలిలో నివాళి ఇచ్వారు లతా మంగేష్కర్.

1215

ఇక లతాజీ అందుకోని అవార్డ్ అంటూ లేదమో.. భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు ఆమో అందుకున్నారు. ఇప్పటి వరకు మన దేశాంలో ఇన్ని అవార్డ్ లు అందుకున్న ఫీమేల్ సింగర్స్ లో ఎంఎస్ సుబ్బలక్ష్మి తరువాత.. ఆ రికార్డ్ లతా మంగేష్కర్ దే.  

1315

1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా లత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించారు. అలాగే గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు. లతాజీ తెలుగులో చాలా తక్కువ పాటలే పాడారు. సంతానం సినిమాలో సుసర్ల దక్షిణామూర్తి ట్యూన్ చేసిన నిదురపోరా తమ్ముడా.. పాటతో పాటు  ఆఖరి పోరాటంలో తెల్లచీరకు పాటను పాడారు. ఈపాట  ఇళయ రాజా కంపోజ్ చేశారు

1415

 లతా మంగేష్కర్ అందుకున్న అరుదైన గౌరవాలలో ఒకటిగా చెప్పకోవాలి అంటే..టైం మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతామంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి. లతా మంగేష్కర్  భారతీయ నేపథ్యగాయకుల రాణి (Queen of Indian Playback Singers) ఆ పత్రిక బిరుదును అందించింది.

1515

లతాజీ మీరు మా మధ్య లేకున్నా.. మీ గాణం మా మదిలో మెదులుతూనే ఉంటుంది. మీ స్వరం మాఆలోచనలలో  హమ్మింగ్ చేస్తూనే ఉంటుంది. మీరు పంచిన తియ్యని రాగాలు మాకు మధురానుభూతులు అందిస్తూనే ఉంటాయి. ఈ భూమిపై  గాత్ర యగ్నం చేసిన మీరు అమరలోకంలో దృవతారగా  వెలుగొందుతారని ఆశిస్తూ... మీకివే మా అశ్రు నివాళులు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Recommended image2
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Recommended image3
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved