- Home
- Entertainment
- Intinti gruhalakshmi: సామ్రాట్ ఇంట్లో ఫంక్షన్.. తులసిని ప్రత్యేకంగా పిలిచిన హనీ తాతయ్య!
Intinti gruhalakshmi: సామ్రాట్ ఇంట్లో ఫంక్షన్.. తులసిని ప్రత్యేకంగా పిలిచిన హనీ తాతయ్య!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 2వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఎపిసోడ్ ప్రారంభంలోనే... హనీ సామ్రాట్ తో ఒక ఇల్లు ఎలా ఉండాలో నేను ఇప్పుడే తెలుసుకున్నాను.ఇప్పటివరకు మనం జీవం లేని ఇంటిలో ఉంటున్నామని అర్థమవుతుంది. ఇల్లంతా పని వాళ్ళ ఉన్నారు గాని నాతో ఆడుకోవడానికి ఎవరూ లేరు వాళ్ళకి నేను అంటే చాలా భయం. నాకు చాలా బోర్ కొడుతుంది అని సామ్రాట్ తో అంటుంది హనీ. నువ్వు రాత్రి అయితే ఇంటికి వస్తావు.
"తులసి ఆంటీ వాళ్ళ ఇంటిలో చాలామంది ఉంటారు, మన ఇంట్లో ఎందుకు ఎవరు ఉండరు?" అని అడగగా సామ్రాట్ తను గతంలో జరిగిన చెల్లెలి మరణం గురించి తలచుకుని బాధపడతాడు. ఆ బాధతో సామ్రాట్ ఏడ్చేస్తాడు. అప్పుడు హనీ ఇంకెప్పుడూ నేను ఆ ప్రశ్న అడగను నాన్న బాధపడొద్దు అని ఓదారుస్తాది. తరువాత మనిద్దరం కలిసి టిఫిన్ చేద్దాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతాది హనీ.
తర్వాత సీన్ లో అంకిత ప్రేమ తో మాట్లాడిన తర్వాత లోపలికి వచ్చేస్తుంది.కానీ ప్రేమ్ మాత్రం అలాగే బాధపడుతూ శృతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగ తులసి అక్కడికి వచ్చి ప్రేమ్ ఈమధ్య ఏదో తెలియని బాధకు గురవుతున్నాడు అని అంకితకి చెప్పి బాధపడుతుంది. తులసి వెళ్లి ప్రేమ్ తో మాట్లాడి అసలు ఏం జరిగింది? అని అడుగుతాది. కానీ ప్రేమ్ మాత్రం ఏం జరగలేదు అని చెప్తాడు.
శృతి గురించి ఆలోచిస్తున్నావా? శృతిని పోని ఇంటికి రమ్మని పిలుస్తాను అని చెప్పి, తులసి శృతి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తుంది. ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. శృతి వాళ్ళ అత్తయ్య ఫోన్ ఎత్తుతాది. మీకు ఆరోగ్యం ఎలా ఉన్నది? మీకు ఒంట్లో బాలేదని శృతి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోడానికి అక్కడికి వెళ్లిందట ప్రేమ్ చెప్పాడు. ఇప్పుడు ఎలాగున్నది అని అడిగితే నాకు నీరసంగా ఉంది.
తర్వాత మాట్లాడతానని పెట్టేస్తుంది శృతి వాళ్ళ అత్తయ్య. ఈ లోగ సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తులసికి ఫోన్ చేసి "నేను మిమ్మల్ని ఒక సహాయం అడుగుతాను కాదనకండి" అని అడుగుతాడు.అప్పుడు తులసి సరే అని అంటుంది. సామ్రాట్ వాళ్ళ బాబాయ్ రేపు వాళ్ళ ఇంట్లో హనీ గెలిచినందుకు చిన్న ఫంక్షన్ పెట్టానని కుటుంబం అంతా కలిసి రావాలని అడుగుతాడు దానికి తులసి సరే అని ఉంటుంది.
దాని తర్వాత సీన్లో నందు రేపు సామ్రాట్ పెట్టిన ఫంక్షన్ కి వెళ్ళను అని అంటాడు.అప్పుడు లాస్య, పిలిచినప్పుడు వెళ్లకపోతే బాగోదు. మన భవిష్యత్తు సామ్రాట్ చేతిలో ఉన్నది.సామ్రాట్ ని ఎలాగైనా మంచిగా చేసుకుని మనం రాతలు మార్చుకోవాలి అని బలవంతం పెట్టి రేపు అక్కడికి రమ్మని అడుగుతుంది. చేసేదేమీ లేక నందు ఒప్పుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.