- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: అంకిత బర్త్‌డే పార్టీలో ప్రేమ్‌కు ఘోర అవమానం.. తులసికి కనీసం సపోర్ట్ ఇవ్వని అభి!
Intinti Gruhalakshmi: అంకిత బర్త్‌డే పార్టీలో ప్రేమ్‌కు ఘోర అవమానం.. తులసికి కనీసం సపోర్ట్ ఇవ్వని అభి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 1న ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే అంకిత (Ankitha) బర్త్డే పార్టీ కి లాస్య దంపతులు వస్తారు. ఇక అంకిత కోసం ఒక చీరను కూడా గిఫ్టుగా ఇస్తారు. ఆ చీరను చూసి గాయత్రి (Gayathri) ఎంతో సంతోషపడుతుంది. ఈలోగా అక్కడకు తులసి ఫ్యామిలీ కూడా వస్తారు. వాళ్లను చూసిన లాస్య దంపతులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతారు.
ఇక లాస్య (Lasya).. ముందు వాళ్ళని లోపలికి రాకుండా చూడు అని గాయత్రి (Gayathri) తో చెబుతుంది. ఇక గాయత్రి తులసి దగ్గరికి వెళ్లి ఎందుకు వచ్చావు తులసి ఫంక్షన్ కి కేవలం ఇన్వైట్ చేసిన వాళ్లే రావాలి అని అవమాన పరుస్తుంది. ఈలోపు అంకిత అక్కడికి వచ్చి ఆంటీ ని నేనే పిలిచాను అని గట్టిగా చెబుతుంది.
అంతేకాకుండా అంకిత (Ankitha) ఆంటీ అంటూ గట్టిగా కౌగిలించుకుంటుంది. ఇక అంకిత ను గాయత్రి (Gayathri) పక్కకు పిలిచి పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేసాం వాళ్ల మధ్య లో వీళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అని అవమాన పరుస్తుంది. ఇక తులసి హ్యాపీ బర్త్డే అంటూ అంకితకు ఒక చీరను గిఫ్ట్ గా ఇస్తుంది. గాయత్రి చేతితో కుట్టిన చీర ఇదొక గిఫ్ట్ ఆ అని అంటుంది.
ఇక తులసి (Tulasi) ఇచ్చిన చీరను అంకిత (Ankitha) హ్యాపీగా రిసీవ్ చేసుకునేందుకు లాస్య దంపతులు కుళ్ళి పోతు ఉంటారు. మరోవైపు ప్రేమ్, అభి లు ఒకరికి ఒకరు హగ్ చేసుకొని మురిసిపోతూ ఉంటారు. అది గమనించిన తులసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడి శృతి వచ్చి చూడటానికి ముచ్చటగా ఉంది కదా ఆంటీ అని అంటుంది.
ఇక ప్రేమ్ (Prem) జాబ్ పోగొట్టుకున్నాడు. తన తల్లి ఆశయం చర్చలేనని కూడా చాలా బాధపడుతున్నాడు ఆంటీ అని అని శృతి తులసి కు చెబుతుంది. ఇక తులసి పెళ్లయిన తర్వాత భర్తకు అన్ని భార్యనే అని శృతికి అర్థమయ్యేలా చెబుతుంది. మరో వైపు నందు (Nandhu) అభి నా కొడుకు అని చెప్పుకోడానికి చాలా ప్రౌడ్ గా ఉంది అని ప్రేమ్ వినే లాగా అంటాడు.
ఇక తరువాయి భాగం లో తులసి (Tulasi) రెండు కుటుంబాల అందరిముందు ఒక పాట పాడుతుంది. ఆ తర్వాత గాయత్రి (Gayathri) అంకిత ఆస్తి గురించి తెలిస్తే తులసి అంకితను బుట్టలో వేసుకొని ఆస్తి మొత్తం కాజేస్తుంది అని అభి కి చెబుతుంది. ఈ మాటలు విన్న తులసి ఎంతో బాధ పడుతుంది. మా అమ్మ అలాంటిది కాదు అని కనీసం అభి చెప్పడం లేదు అని బాధ పడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.