- Home
- Entertainment
- పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ బయటకొచ్చిన కియారా-సిద్ధార్థ్ జంట.. గ్రాండ్‌గా రిసెప్షన్‌కి ప్లాన్.. డిటెయిల్స్
పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ బయటకొచ్చిన కియారా-సిద్ధార్థ్ జంట.. గ్రాండ్‌గా రిసెప్షన్‌కి ప్లాన్.. డిటెయిల్స్
హీరోయిన్ కియారా అద్వానీ, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ బయటకొచ్చారు. కెమెరాలకు చిక్కారు.

Kiara Advani, Siddharth Malhotra reception
టాలీవుడ్‌లో `భరత్ అనే నేను` చిత్రంలో నటించి మెప్పించిన కియారా అద్వానీ బాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఆమె గత రెండేళ్లుగా సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉంది. తమ ప్రేమని ఈఇద్దరు పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఫిబ్రవరి 7న రాజస్థానంలో హిస్టారికల్ ప్యాలెస్ `జైసల్మేర్`లో గ్రాండ్ లెవల్‌లో వివాహం చేసుకున్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో వీరి వెడ్డింగ్ జరిగినట్టు సమాచారం. పూర్తి ప్రైవేట్‌గా ఈ మ్యారేజ్ వేడుక జరిగింది. సెల్‌ఫోన్‌కి దూరంగా పూర్తి సెక్యూరిటీ మధ్య వీరి వెడ్డింగ్ జరగడం విశేషం. అందుకే పెళ్లి ఫోటోలు ఒక్కటీకూడా లీక్ కాలేదు. ఆ తర్వాత కియారా, సిద్ధార్థ్ నే అధికారికంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నెమ్మదిగా తమ ఫోటోలు, చిన్న చిన్న వీడియో క్లిప్పులను విడుదల చేస్తూ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేశారు.
కియారాకి సిద్ధార్థ్ వెల్కమ్ చెప్పే వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అయితే ఈ జంట పెళ్లి గ్రాండ్‌గానే కాదు, చాలా ఖరీదుతోనూ కూడినదని సమాచారం. ఇదిలా ఉంటే పెళ్లి పూర్తయ్యాక ఢిల్లీలోని తమ నివాసానికి చేరుకున్నారీ జోడీ. అక్కడ చిన్న పాటి రిసెప్షన్‌లో పాల్గొన్నారట.
ఇప్పుడు ముంబయిలో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఈ రిసెప్షన్‌లో పాల్గొనబోతున్నారని సమాచారం. రేపు ఆదివారం(ఫిబ్రవరి 12న) ముంబయిలోని సెయింట్ రెజిస్ హోటల్‌లో ప్లాన్ చేశారట. సాయంత్రం ఈ రిసెప్షన్ ఉండబోతుందట.
అయితే రిసెప్షన్ కోసం ముంబాయి చేరుకున్నారు కియారా, సిద్ధార్థ్. పెళ్లి తర్వాత మొదటిసారి ఈ జంట బయట కనిపించింది. కెమెరాలకు చిక్కింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయి.
కియారా, సిద్ధార్థ్ కలిసి 2021లో `షేర్షా` చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇన్నాళ్లు సీక్రెట్‌గా ప్రేమించుకున్న ఈ జంట గతేడాది మిడిల్ తర్వాత కలిసి బయట కనిపించడం స్టార్ట్ చేశారు. ఫంక్షన్లలోనూ కలిసే హాజరయ్యేవారు. అలా తమ ప్రేమని కన్ఫమ్ చేస్తూ వచ్చారు. పెళ్లిపై ఎలాంటి కామెంట్ చేయని ఈ జోడీ డైరెక్ట్ గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్ చేయడం విశేషం.
కియారా అద్వానీ తెలుగులో మహేష్‌తో `భరత్ అనే నేను`, రామ్‌చరణ్‌తో `వినయ విధేయ రామ` చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి చరణ్‌తో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌సీ15` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.