న్యూ ఇయర్ కోసం మాల్దీవులకు చెక్కేసిన మహేష్ హీరోయిన్ కియారా అద్వానీ.. ప్రియుడు ఉన్నాడా?
సెలబ్రిటీలకు న్యూ ఇయర్ ఫీవర్ అంటుకుంది. కరోనా అనేది పక్కన పెట్టి కొత్త సంవత్సర వేడుకల్లో మునిగితేలేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది గోవాకి చెక్కేశారు. ఇక మహేష్ హీరోయిన్ కైరా అద్వానీ కొత్త సంవత్సర వేడుకలను మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమైంది.
మహేష్‌తో `భరత్ అనే నేను`లో మెరిసిన కియారా అద్వానీ సడెన్‌గా అందాల ద్వీపకల్పం మాల్దీవుల్లో ప్రత్యక్షమై, తాను చాలా ఫాస్ట్ గురూ అనిపించుకుంది. ఈ బ్లూ ఐలాండ్‌లో సీ సూట్లో కనిపించింది.
ఒంటిపై డ్రెస్‌ని ఎంత తగ్గించుకుంటే అంత బాగుంటుందనేది రెడీ అయ్యింది కియారా. బీచ్‌లో బ్యాక్ నుంచి ఫోటో దిగి సోషల్ మీడియాలో పంచుకుంది. 2021 కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. `మీ కోసం 2021 ఏడాదిని పట్టుకొస్తాను` అని పోస్ట్ చేసింది కియారా.
అయితే కైరా సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి వెళ్లినట్టు తెలుస్తుంది. నెటిజన్లు కూడా ఇదే చెబుతున్నారు. ఈ ఫోటో తీసింది సిద్ధార్థ్ మల్హోత్రా అని కామెంట్ చేస్తున్నారు. కియారా, సిద్దార్థ్ ప్రస్తుతం బాలీవుడ్ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. చాలా సార్లు వీరిద్దరు కెమెరాలకు చిక్కారు కూడా.
న్యూ ఇయర్ వేళ ఈ హాట్ లవ్ బర్ద్స్ ద్వీపకల్పంలో ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పొచ్చు. ఇన్నాళ్లు కరోనా వల్ల చాలా వరకు ఒంటరి జీవితం గడిపిన ఈ జోడి ఇప్పుడు రొమాన్స్ తో రెచ్చిపోతున్నారనే కామెంట్స్ నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.
మరోవైపు కియారా బీచ్ ఫోటో ఇప్పుడు కుర్రాళ్ల మతిపోగొడుతుందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాజల్, రకుల్ వంటి వారు మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన ఫొటోలతో ఎలా అయితే హీట్ పెంచారో.. ఇప్పుడదే మార్గంలో కియారా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ పిక్కే ఇలా ఉంటే.. ఇంకా ఆమె నుంచి రాబోయే పిక్స్ ఎంత హాట్‌గా ఉంటాయో చూడాలి.
ఇక మహేష్‌బాబుతో `భరత్ అనే నేను` చిత్రంలో హీరోయిన్గా నటించి తెలుగు ఆడియెన్స్ ని అలరించింది కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో `వినయ విధేయ రామ`లో మెరిసింది.
ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. గతేడాది వచ్చిన `కబీర్ సింగ్`తో బంపర్ హిట్‌ని అందుకుంది.
ఈ ఏడాది `గిల్టీ`, `లక్ష్మీ బాంబ్`, `ఇందూ కి జవానీ` చిత్రాల్లో నటించి అలరించింది కియారా అద్వానీ. ఇవి మంచి విజయాలను సాధించాయి.
ప్రస్తుతం ప్రియుడు సిద్ధార్థ్ తో కలిసి `షేర్షా` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `భూల్ భులైయ్యా 2`, `జగ్ జుగ్ జీయో` చిత్రాల్లో నటిస్తుంది బిజీగా ఉందీ సెక్సీ బ్యూటీ.