Devatha: దేవుడమ్మ ఇంట్లో బారసాల వేడుకలు... రుక్మిణి వెళ్ళనుందా?
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 20వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... నేను నా పరీక్ష అయ్యాక చెప్తాను. అందులో పాస్ అయితే మీరు కూడా షాక్ అవుతారు అది విజయవంతంగా జరగాలని నాకు గోరుముద్ద పెట్టు అమ్మ అని మాధవ్ అంటాడు. రుక్మిణి మనసులో,మాధవ్ సార్ మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తున్నారా అని అనుకుంటుంది. జానకమ్మ మాధవ్ కి ముద్ద పెడుతున్నప్పుడు దేవుడమ్మ, జానకమ్మ కి ఫోన్ చేస్తుంది ఇలాగ కమలకి బిడ్డ పుట్టింది రేపు బారసాలు చేస్తున్నాము మీరు తప్పకుండా రావాలి అని అంటుంది. ఖచ్చితంగా వస్తాము అని జానకమ్మ అంటుంది.
అప్పుడు దేవుడమ్మ జానకమ్మతో ఒకసారి దేవికి ఇవ్వండి ఫోను అని అంటుంది. అప్పుడు దేవుడమ్మ,కమల పెద్దమ్మకి ఎప్పుడు పాప పుడుతుంది అని అడిగావు కదా పాప పుట్టింది రేపు బారసాలు కచ్చితంగా నువ్వు రావాలి ,అలాగే నేనెప్పుడూ చూడని మీ అమ్మని కూడా తీసుకురావాలి మర్చిపోవద్దు అని అంటుంది. అప్పుడు దేవి కచ్చితంగా తీసుకొస్తాను అవ్వా అని చెప్తుంది. ఈ మాటలన్నీ రుక్మిణి ఒక మూలనని వింటుంది. తర్వాత రుక్మిణి ఆదిత్య కి ఫోన్ చేస్తుంది ఈ సమయంలో ఎందుకు చేశావు అని అడుగుతాడు ఆదిత్య.
అప్పుడు రుక్మిణి, అత్తమ్మ ఇక్కడ ఫోన్ చేసింది కమలక్కకు బిడ్డ పుట్టిందని రేపు బారసాలకు రమ్మంటుంది అని అనగా నువ్వు ఎలా వస్తావు వద్దు అని అంటాడు ఆదిత్య. అక్కడ అందరూ ఉండి నేనొక్కదాన్నే లేకపోతే ఎలాగ నాకు రావాలి అని ఉన్నది కమలక్క బిడ్డని నేను చూడడానికి అవ్వదా ఏదైతే అది అయింది నేను వచ్చేస్తాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో దేవుడమ్మ ఇంట్లో వాళ్ళందరూ బారసాల కోసం ఇల్లంతా డెకరేషన్ చేస్తున్నారు.అప్పుడు దేవుడమ్మ బారసాలు ఘనంగా చేయాలి,అందరికీ ఫోన్ చేశాను.
అలాగే జానకమ్మ వాళ్లకి ఫోన్ చేసి దేవిని, వాళ్ళ అమ్మని కూడా తీసుకురమ్మని చెప్పాను అని అనగా సత్య ఆదిత్య వైపు చూస్తుంది. ఆదిత్య మనసులో, రుక్మిణి కూడా వస్తానంటుంది తను చెప్పిందంటే కచ్చితంగా వస్తుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో కమల దేవుడమ్మ దగ్గరకు వెళ్లి ఏడుస్తూ నా కోసం మీరు ఇంత చేస్తున్నారు అమ్మ, భాషకి ఉద్యోగం ఇచ్చారు, నాకు మీ ఇంటిలో స్థానం ఇచ్చారు. అసలు మేము మీకు ఎవరమనీ ఇదంతా చేస్తున్నారు, మీకు చాలా రుణపడి ఉంటాము అని అంటుంది.
నువ్వు పరాయి దానివి కాదు నువ్వు మా రుక్మిణి సొంత అక్కవి. మీ ముగ్గురిని కలిసి చూడాలనుకుంటాను గానీ నేను ఎందుకు విడదీస్తాను అయినా నాకు సత్య ఎంతో నువ్వు అంతే. ఇంట్లో ఎన్నాళ్లు నుంచోలేని పిల్లల సందడి ఇప్పుడు నీ వల్ల వస్తుంది నువ్వు అలాగ ఏమీ ఆలోచించొద్దు అని అంటారు. ఆ తర్వాత సీన్లో ఇంటి బయట దేవుడమ్మ భాష కలిసి అతిథులను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత సీన్లో జానకమ్మ ఇంట్లో వాళ్ళందరూ బారసాలకు తయారవుతారు కానీ రుక్మిణి మాత్రం తయారవదు.
దేవి,రుక్మిణి దగ్గరికి వెళ్లి నేను అవ్వకి మాట ఇచ్చిన నువ్వు వస్తావని నువ్వు రా అమ్మ అని అనగా మీరు వెళ్ళండి నేను వస్తాను అని అంటుంది రుక్మిణి. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు ఎక్కడికి రావు అని అలిగి వెళ్లిపోతుంది దేవి.అప్పుడు జానకమ్మ రుక్మిణి దగ్గరికి వెళ్లి, వస్తాము అని అంటుంది. వెళ్తూ వెళ్తూ జానకమ్మ మనసులో రాధ ఎందుకిలా ఉంది. మనసులో ఏదో తెలియని బాధ పెట్టుకుంది ఏంటో కనుక్కోవాలి అని అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం వరకు ఎదురు చూడాల్సిందే!