లైంగిక వేధింపులకి గురి చేసిన ఆ సినీ ప్రముఖులు ఎవరు?

First Published 1, Jun 2020, 8:26 AM

సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల అంశం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. సిని పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ రాజ్యమేలుతోందని, ఆఫర్స్ రావాలంటే లొంగిపోవాల్సిందే అని ఇప్పటికే ఎందరో నటీమణులు సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఇదే అంశంపై తమిళ నటి కళ్యాణి (పూర్ణిత) రియాక్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. లైంగిక దోపిడీ అనేది ఒక్క సినిమాల్లోనే కాదు టీవి పరిశ్రమలో కూడా ఉందంటూ తన అనుభవాలు చెప్పుకొచ్చింది.

కేరళ రాష్ట్రానికి చెందిన కళ్యాణి మొదట తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బాగానే ఆఫర్స్ వచ్చాయి. అయితే ఊహించని విధంగా ఆ తర్వాత బుల్లితెరకు షిప్ట్ అయ్యింది. అక్కడ కూడా కొన్ని కార్యక్రమాల్లో నటించి క్రమంగా కెమెరాకు దూరమైంది.

ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థ ఆమె సినీ,టీవి పరిశ్రమలను వదలేయటం వెనక ఉన్న కారణాలేంటి? అనే విషయమై ఇంటర్వూ చేసింది. అందులో ఆమె షాకింగ్ ఆన్సర్ చెప్పింది. అదే హాట్ టాపిక్ గా మారింది.

అయితే తాను నటనకు దూరం కావడానికి కారణం లైంగిక వేధింపులు, కమిట్‌మెంట్ అంశాలే ప్రధాన కారణమని చెప్పుకొచ్చింది నటి కళ్యాణి.ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవడంతో తాను నటనకు దూరమయ్యానని తమిళ నటి కల్యాణి తెలిపారు.

‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలోనే ప్రభుదేవాతో కలిసి ‘అలై తండా వానమ్‌’ చిత్రంలో నటించాను. నటిగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాను. అయితే హీరోయిన్‌గా మంచి అవకాశాలు వస్తోన్న తరుణంలో కొత్త మంది వ్యక్తుల నుంచి మా అమ్మకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. సినిమాల్లో నటించాలంటే కొన్ని విషయాల్లో నేను సర్దుకుపోవాలని వాళ్లు అన్నారు. సదరు వ్యక్తుల మాటలతో సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాను.

కొంతకాలానికి బుల్లితెరలో నటించడానికి అవకాశాలు వచ్చాయి. అలా పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెరలో పేరు తెచ్చుకున్నాను. అయితే బుల్లితెరలో కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. దాంతో నేను నటనకు దూరమయ్యాను. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాను’ అని కల్యాణి తెలిపారు.

బుల్లితెర ఇండస్ట్రీలోనూ ఈ రకమైన ధోరణి ఉందని కళ్యాణి పేర్కొంది. తనకు అలాంటి చేదు అనుభవాలు చాలా ఎదురయ్యాయని చెప్పింది. ఓ టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించిన పెద్ద వ్యక్తి రాత్రికి పబ్బుకు రావాలని అన్నాడని, దానికి తాను కుదరదని చెప్పడంతో ఆ టీవీలో ఏ కార్యక్రమంలోనూ తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పింది. ఇలాంటి పరిణామాల కారణం గానే నటనకు దూరం కావాల్సి వచ్చిందని కళ్యాణి తెలపడం విశేషం.

తమిళంలో తెరకెక్కిన ‘జయం’, ‘అలై తండా వానమ్‌’, ‘ఎస్‌ఎంఎస్‌’ సినిమాలతోపాటు తెలుగులో ‘మళ్లీ మళ్లీ’ చిత్రంలో నటించి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలు, సీరియల్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆమె కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఆమె తనను కొందరు సినీ ప్రముఖులు లైంగిక వేధింపులకు గురి చేసారని ఆరోపణలు చేయటంతో..ఎవరా ప్రముఖులు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. దాంతో ఆమె నటించిన సినిమాలు, మధ్యలో వదిలేసిన సినిమాలు ఏమున్నాయా అని సోషల్ మీడియా జనం తెగ వెతుకుతున్నారు.

loader