Brahmamudi: అప్పుని సేవ్ చేసిన కళ్యాణ్.. కోడల్ని హద్దుల్లో ఉండమంటున్న అపర్ణ?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కథ కథనాలతో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. అనుకోకుండా ఉన్నత కుటుంబంలోకి కోడలుగా వచ్చి అందరి మన్ననలు అందుకుంటున్న ఒక మధ్యతరగతి ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఐస్ క్రీమ్ తినటం వల్ల ఇలా జరిగింది ఇందులో తన తప్పు ఏమీ లేదు తనే కష్టపడి నన్ను సేవ్ చేసింది అని తల్లికి చెప్తాడు రాజ్. రాత్రంతా నిద్రపోలేదు వెళ్లి పడుకోమని భార్యకి చెప్తాడు. కావ్య వెళ్ళిపోయిన తరువాత అనవసరంగా నోరు పారేసుకున్నావు.
ఇప్పుడు వెనక్కి తీసుకుంటావా అందుకే ఆలోచించి మాట్లాడాలి అని అపర్ణని మందలిస్తుంది చిట్టి. మరోవైపు కావ్య పడుతున్న ఇబ్బందిని చూసి బాధపడతారు కృష్ణమూర్తి దంపతులు ఒక అబద్ధం ఇంత పని చేస్తుందని ఇప్పుడే అర్థమైంది. మన ఇద్దరి పిల్లల్ని ఇంత అసహ్యించుకుంటున్నారు ఇప్పుడు మూడో పిల్లని రక్షించమని ఎలా అడుగుతాము అంటుంది కనకం.
పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్ళ పోలీసులు కాళ్ళ మీద పడదాము అంతకుమించి ఏం చేయగలం అంటాడు కృష్ణమూర్తి. మరోవైపు ఫిట్నెస్ ట్రైనింగ్ కోసం అప్పుకి ఫోన్ చేస్తాడు కళ్యాణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అప్పు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ అప్పు పెద్దమ్మ నిజం చెప్తే ఎక్కడ వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పేస్తాడో అని ఊరు వెళ్ళింది కానీ కంగారుపడుతూ అబద్ధం చెప్తుంది.
సరే అని చెప్పి బయటకు వచ్చేసిన కళ్యాణ్ ఈవిడ ఎందుకు అంత కంగారు పడుతుంది నిమిషానికి ఒక మాట మాట్లాడుతుంది సంథింగ్ ఇస్ రాంగ్ అనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు కిచెన్లో ఉల్లిపాయ తరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. అది చూసిన ధాన్యలక్ష్మి అత్తగారు తిట్టినందుకు ఏడుస్తుంది అనుకుంటుంది. అదే విషయం వెళ్లి కావ్యని అడుగుతుంది.
అలాంటిదేమీ లేదు అత్తయ్య నేను ఉల్లిపాయలు తరగడం వల్ల కన్నీరు వస్తుంది అంతేకానీ బాధపడటం లేదు. అయినా ఆవిడ కొడుకు మీద ప్రేమతో నన్ను అలా అన్నారు అంతే నన్ను అలా అన్నందుకు నిజం తెలుసుకున్నాక ఆవిడ కళ్ళల్లో పశ్చాతాపం కనిపించింది అది చాలు నాకు అంటుంది. నేటి జనరేషన్ అమ్మాయిలు తిడితే దాని వెనుక ఉన్న కారణం ఆలోచించకుండా నాకు అర్థం చేసుకుంటున్నారు.
కానీ నువ్వు అందరినీ ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావు అని మెచ్చుకుంటుంది ధాన్యలక్ష్మి. ఈ మాటలు అన్నీ రాజ్ వింటాడు. మరోవైపు పోలీస్ స్టేషన్లో ఎస్సైని బ్రతిమాలుకుంటూ ఉంటారు కనకం దంపతులు. ఇంతలో కళ్యాణ్ లాయర్ ని తీసుకొని వస్తాడు రాకేష్ చేత కేసు విత్ డ్రా చేయించి కేసు లేకుండా అప్పుని బయటకు తీసుకు వస్తాడు. అందరూ అతనికి కృతజ్ఞతలు చెప్తారు. అది నా బాధ్యత అయినా ఇంత జరిగితే నాకు ఒక ముక్క చెప్పాలి కదా బంతి చెప్పే వరకు నాకు జరిగింది తెలియదు అంటాడు కళ్యాణ్.
కళ్యాణ్ చేసిన పనికి ఫిదా అయిపోతుంది అప్పు. మరోవైపు భార్య దగ్గరికి వచ్చి కోడల్ని అన్ని మాటలు అన్నావు ఎలాగూ వెనక్కి తీసుకోలేవు కనీసం సారీ చెప్పు అంటాడు సుభాష్. నేను అవుతానికి సారీ చెప్పటమా అది చచ్చినా జరగదు అంటుంది అపర్ణ. అయితే నీ కొడుకుని సేవ్ చేసినందుకు థాంక్స్ చెప్పు అంటాడు సుభాష్. అది ఒక భార్యగా తన బాధ్యత అని అపర్ణ చెప్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా కావ్య దగ్గరికి తీసుకువెళ్తాడు సుభాష్.
భర్త బలవంతం మీద కోడలికి థాంక్స్ చెప్తుంది అపర్ణ.ఆయన మీకు కొడుకు మాత్రమే కాదు నాకు భర్త కూడా అంటుంది కావ్య. థాంక్స్ చెప్పానని నువ్వు ఎక్కువ ఊహించుకోవద్దు నీ హద్దులో నువ్వు ఉండు అంటుంది అపర్ణ. నాకు తెలుసు అత్తయ్య ఇప్పుడు కూడా మీరు మావయ్య చెప్పమన్నారు అని థాంక్స్ చెప్పారు అంటుంది కావ్య. అపర్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భార్య చేసిన పనికి సుభాష్ కావ్యకి సారీ చెప్తాడు.
మరోవైపు కావ్య హాస్పిటల్లో డబ్బులు కోసం కంగారు పడటం గుర్తుకు వచ్చి తన దగ్గర ఇన్నాళ్లు డబ్బులు లేకుండా ఎలా గడిపింది.. స్వేచ్ఛ హక్కు అంటూ మాట్లాడుతుంది కానీ ఇప్పుడు ఆర్థిక స్వేచ్ఛ గురించి మాట్లాడలేదు అయినా తన గురించి ఇవ్వక మనిషిగా అయినా ఆలోచించాలి తనకి కొంత డబ్బు ఇవ్వాలి అనుకుంటాడు రాజ్. తరువాయి భాగంలో కావ్య పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయిస్తాడు రాజ్.