క్యూట్ హీరోయిన్ కి లవ్ ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్.. వైరల్
బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజేంద్ర రెడ్డి దర్శకుడు కాగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే తొలిసారి ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నారు.
రిలీజ్ త్వరలో ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జోడిగా ఆషిక రంగనాథ్ నటిస్తోంది. తెలుగులో ఈ క్యూట్ హీరోయిన్ కి ఇదే తొలి చిత్రం. అప్పటికే అమిగోస్ పాటలు, ట్రైలర్ విడుదలయ్యాయి. ఆషిక అవసరమైన మేరకు గ్లామర్ ఒలకబోసినట్లు అర్థం అవుతోంది. తాజాగా అమిగోస్ చిత్ర యూనిట్ కళ్యాణ్ రామ్, ఆషిక, బ్రహ్మాజీ.. సుమ అడ్డా షోకి హాజరయ్యారు. ఈ షో ప్రోమో విడుదలయింది.
సుమ ఈ షోలో కళ్యాణ్ రామ్ తో ఒక రేంజ్ లో హంగామా చేయించింది. కళ్యాణ్ రామ్ రాగానే అమిగోస్ అంటే ఏంటి అని అడిగింది. స్పానిష్ లో అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని కళ్యాణ్ రామ్ వివరించాడు. అయితే ఫ్రెండ్స్ అనే పెట్టొచ్చుగా అంటూ సుమ తనదైన శైలిలో పంచ్ లు వేసే ప్రయత్నం చేసింది.
షోలో ఒక అమ్మాయి.. నన్ను 10 మంది అబ్బాయిలు ఫాలో అవుతున్నారు అని చెబుతుంది. ఆయనకే చెప్పావా.. రేపటి నుంచి ఆయన కూడా నీవెంట పడతారు అంటూ సుమ బ్రహ్మాజీపై సెటైర్లు పేల్చింది.
అనంతరం సుమ కళ్యాణ్ రామ్ కి ఒక టాక్స్ ఇచ్చింది. ఆ టాస్క్ ప్రకారం కళ్యాణ్ రామ్ హీరోయిన్ ఆషికకి ప్రపోజ్ చేయాలి. రోజ్ పట్టుకుని కళ్యాణ్ రామ్ ఆమెకి చాలా బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేయడం ప్రోమోలో చూడొచ్చు.
ఆ తర్వాత కళ్యాణ్ రామ్ మీరు ఇంకా బావున్నారు అంటూ ఆ రోజ్ ని సుమకి ఇవ్వడం నవ్వులు పూయిస్తోంది. ఏది ఏమైనా కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తొలి సారి ట్రిపుల్ రోల్ లో నటిస్తుండడంతో కళ్యాణ్ రామ్ ఎలా చేశాడు అనే ఉత్కంఠ ఉంది.