షారుక్ కొడుకుతో కాజోల్ కూతురి వివాహం...వైరల్ న్యూస్..!
సోషల్ మీడియా వైరల్స్ ఎప్పుడూ నెటిజెన్స్ ని ఆ ఆకర్షిస్తూ ఉంటాయి. బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ స్టోరీ ఏంటంటే...
బాలీవుడ్ కింగ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, కాజోల్ టీనేజ్ డాటర్ నైసా దేవ్ గణ్ పెళ్లి చేసుకోనున్నారనే మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ లో షారుక్ అండ్ కాజోల్ హిట్ పెయిర్ గా ఉన్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించిన షారుక్, కాజోల్ పేర్లు ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ దిల్ వాలే ఇటీవల 25ఏళ్ళు పూర్తి చేసుకుంది.
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్... కాజోల్ కూతురు నైసా దేవ్ గణ్ ని లేపుకుపోయి పెళ్లి చేసుకుంటే కాజోల్ రియాక్టన్ ఏమిటీ?
నిజంగా ఈ ప్రశ్న కాజోల్ కి ఓ సంధర్భంలో ఎదురైంది. 2007లో కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కాజోల్ ని కరణ్ జోహార్ ఈ ప్రశ్న అడిగారు.
ఈ ప్రశ్నకు తనదైన శైలిలో కాజోల్ స్పందించారు. అప్పట్లో ఈ న్యూస్ పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
ఇదే విషయంపై ఆ తరువాత షారుక్ కూడా స్పందించారు. ఆ షోలో షారుక్, కాజోల్ మరియు రాణి ముఖర్జీ పాల్గొన్నారు.
దిల్ వాలే మూవీ సక్సెస్ గురించి షారుక్, కాజోల్ మాట్లాడగా...నెటిజెన్స్ ఆర్యన్ ఖాన్, నైసా దేవ్ గణ్ ప్రేమ, పెళ్లి అనే కథలు తెరపైకి తెచ్చారు.
నిజానికి ఆర్యన్ ఖాన్ మరియు నైసా దేవ్ గణ్ మధ్య స్నేహం కూడా లేదు.
బోల్డ్ కంటెంట్ కలిగిన కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం లోని ప్రశ్నలు, సమాధానాలు అనేవి తరచుగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.