పెళ్లి తర్వాత కమిట్‌మెంట్లని పూర్తి చేసే పనిలో బిజీగా కాజల్.. ఇప్పటికే ఒకటి కంప్లీట్
First Published Dec 28, 2020, 10:18 AM IST
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్ళి ఆనందం నుంచి త్వరగానే బయటపడింది. నెలరోజులు తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి హనీమూన్ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుసగా తన కమిట్ అయిన సినిమా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో పడింది. తాజాగా తన తమిళ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

పెళ్లైన తర్వాత కాజల్ మొదటగా చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య` చిత్ర షూటింగ్‌లో పాల్గొంది. ఈ నెల 15న కాజల్ తన భర్త గౌతమ్‌తో వచ్చి చిరంజీవి ఆశీర్వాదాలు తీసుకుంది.

మరోవైపు తమిళ సినిమా షూటింగ్‌ని కూడా పూర్తి చేసుకునే పనిలో బిజీగా ఉంది. ఓ వైపు `ఆచార్య`, తమిళంలో `హే సినామిక` షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?