భర్తతో కలిసి వీధుల్లో గంతులేస్తున్న కాజల్.. న్యూ ఇయర్ స్పెషల్
కాజల్ ఎంజాయ్మెంట్కి బ్రేక్‌లు, బార్డర్స్ లేవనే చెప్పాలి. ఓ వైపు కొత్తగా పెళ్ళి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, మరోవైపు కొత్త బిజినెస్‌లను స్టార్ట్ చేస్తూ తెగ హంగామా చేస్తూందీ అమ్మడు. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ని సరికొత్తగా స్టార్ చేసింది. భర్తతో కలిసి వీధుల్లో గంతులేసింది. అంతేకాదు ఫిలాసఫీలు చెబుతోంది.
కాజల్ ఇటీవల తన భర్తతో కలిసి `కిచ్డ్` పేరుతో దిండ్ల బిజినెస్‌ని స్టార్ట్ చేసింది. చేతులతో తయారు చేసిన ఈ డిజైనింగ్ దిండ్లని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉంది.
మరోవైపు పెళ్ళి తర్వాత నెల రోజుల పాటు భర్తతో కలిసి హనీమూన్ ఎంజాయ్ చేసిన కాజల్ ఇటీవలే షూటింగ్లో పాల్గొంటూ వస్తోంది. ఆమె ఇప్పటికే తమిళంలో నటిస్తున్న `హే సినామిక` చిత్ర షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. `ఆచార్య` షూటింగ్‌లోనూ పాల్గొంది.
ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ షురూ చేసింది. భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి గంతులేస్తుంది. తాజాగా కాజల్ ఆయా ఫోటోలను పంచుకుంది.
హిస్టారికల్ ప్లేస్‌కి విజిట్ చేసి అలరించింది కాజల్. తన భర్త గౌతమ్ కిచ్లు, అలాగే బావ, తోడుకోడలుతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను స్టార్ట్ చేసింది. అందమైన ప్రదేశాన్ని వీక్షిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. తమ ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంది.
ఈ సందర్భంగా తోడు కోడలుతో కలిసి పైకి ఎగురుతున్న ఫోటోని పంచుకుని, ఎవరు ఎక్కువ పైకి ఎగిరారో చెప్పాలని తెలిపింది.
అలాగే ఇందులో భర్త గౌతమ్, ఆయన సోదరుడు కూడా ఎగిరే ఫోటోలను పంచుకుంది కాజల్.
మరోవైపు వీధుల్లో చక్కర్లు కొడుతుంది. వింటర్ అనేది ఓ సీజన్ కాదు, ఇదొక సెలబ్రేషన్ అని పేర్కొంది.
ప్రస్తుతం కాజల్ పంచుకున్న ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే కాజల్ ఈ సందర్భంగా ప్రముఖ ఇంగ్లీష్ రైటర్ జెఫ్ పోస్టర్ రాసిన వ్యాఖ్యలను పంచుకుంది కాజల్. అభిమానులను బాగా అలరిస్తున్నాయి. ఫ్యాన్స్ , నెటిజన్లు కామెంట్లతో ఆనందాన్ని పంచుకుంటున్నారు.