చల్లని మంచు కొండల్లో, వెచ్చని భర్త కౌగిలిలో... వైరల్ అవుతున్న కాజల్ రొమాంటిక్ వెకేషన్ పిక్స్!
First Published Jan 2, 2021, 5:02 PM IST
మ్యారేజ్ మూడ్ నుండి కాజల్ ఇంకా బయటికి రాలేదు. పెళ్ళై రెండు నెలలవుతున్నా కొత్త జంట కాజల్, గౌతమ్ ఖాళీ దొరికితే చాలు విహారానికి చెక్కేస్తున్నారు. పెళ్ళైన అనంతరం మూడువారాలకు పైగా మాల్దీవ్స్ లో హనీమూన్ వెకేషన్ ఎంజాయ్ చేశారు వీరిద్దరూ.

హనీమూన్ నుండి వచ్చిన కాజల్, కమిటైన చిత్రాల షూటింగ్స్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ లో పాల్గొన్నారు. కాగా కొంచెం షూటింగ్ కి గ్యాప్ వచ్చిందో లేదో మరో వెకేషన్ ప్లాన్ చేశారు.

పెళ్ళైన తరువాత వచ్చిన మొదటి న్యూ ఇయర్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు కాజల్ మరియు భర్త కిచ్లు గౌతమ్. ఏకాంతంగా గడపడానికి వీరిద్దరూ చల్లని హిల్ స్టేషన్ కి చెక్కేశారు. ప్రస్తుతం కాజల్ కుఫ్రి హిల్ స్టేషన్ లో ఉన్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?