- Home
- Entertainment
- Janaki kalaganaledu: మల్లిక తిక్క కుదిర్చిన గోవిందా రాజులు.. రామాను పట్టించుకోని జ్ఞానాంబ!
Janaki kalaganaledu: మల్లిక తిక్క కుదిర్చిన గోవిందా రాజులు.. రామాను పట్టించుకోని జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 2వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం...

ఎపిసోడ్ ప్రారంభంలోనే... మల్లిక వాళ్ళ మావయ్య మల్లికని ఈరోజు నువ్వు నోరు ఇప్పడానికి వీలు లేదు అని తిడుతుండగా జ్ఞానాంబ అక్కడికి వచ్చి ఏమైంది అని కనుక్కుంటాది. అప్పుడు మల్లికా వాళ్ళ మావయ్య మల్లికాని ఎటకారిస్తూ తిడతాడు. ఈ లోగా జ్ఞానంబ మల్లిక ను విగ్రహం శుద్ధి చేయమని అడగగా మల్లికా వెళుతుంది.అప్పుడు జానకి గతంలో పెళ్లయిన కొత్త లో తన చేతుల మీదగా జరిగిన వరలక్ష్మీ వ్రతం గురించి తలుచుకుంటాది.
బయట రామ వంటలు చేస్తూ ఉంటాడు. వంటలు చేస్తూ ఇందాక జరిగిన సంఘటనన్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఆలోచనలో పడి చేయి కాల్చుకుంటాడు. జ్ఞానాంబ అప్పుడు చూసి రామ దగ్గరికి వచ్చేలోగ జానకి అక్కడికి వచ్చి ఏమైంది అని కంగారుగా అడిగింది రామా గారి చేయ చూసి మందు తెస్తాను అని అంటుంది.
అప్పుడు రామ ,అమ్మ నా దగ్గరికి రాకపోతే నా ప్రాణమే పోతుంది దాని ముందు నొప్పి అంతా అని చెప్పి జానకితోపాటు మందు పెట్టించుకోవడానికి లోపలికి వెళ్తాడు.అప్పుడు జానకి, రామా కి మందు పూస్తుంది. దూరం నుంచి జ్ఞానాంబా,రామ పడుతున్న నొప్పిని చూసి బాధపడుతూ ఉంతుంది. నొప్పిగా ఉందని జానకి రామాను అడగగా రామా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ గుండెల్లో నొప్పిగా ఉంది అని చెప్తాడు.
జ్ఞానాంబ ఏడుస్తూ అటువైపు నుంచి వెళ్ళిపోతాది. జానకి రామాను బాధపడొద్దు అని ఓదారుస్తాది.కానీ రామా చాలా బాధపడతాడు ఆ మాటలన్నీ జ్ఞానంబు దూరం నుంచి విని కృంగిపోతూ ఏడుస్తాది. ఈలోగా వరలక్ష్మీ వ్రతానికి ఊరిలోని ముత్తైదువులందరూ వస్తారు. ముత్తైదులు అందరూ వచ్చి ఇల్లంతా పండుగ కళతో కలకలలాడుతుంది.కానీ నీ ముఖం ఎందుకు అలా ఉంది అని అడగగా ఏమీ లేదు అని చెప్పి వాళ్లందరినీ లోపలికి తీసుకువెళ్తాది.
శుద్ధి చేసిన దేవుడి విగ్రహాన్ని పీటల మీద పెట్టమని జ్ఞానాంబ చెప్పగా అక్కడున్న ముత్తైదువులందరూ సాంప్రదాయం ప్రకారం ఈ పని పెద్ద కోడలు చేయాలి కదా అని అడుగుతారు. అప్పుడు జ్ఞానాంబ కిందటి సంవత్సరం పెద్ద కోడలు చేత చేయించాను కనుక ఈ సంవత్సరం చిన్న కోడలు చేత చేయిస్తున్నాను అని అంటుంది.
కానీ జానకి వాళ్ళ మామయ్య మాత్రం చాలా తెలివిగా మల్లికని ఎటకారిస్తూ ఇక్కడి వరకు విగ్రహాన్ని తెరిచి అలసిపోయి ఉంటావు జానకి విగ్రహం పీటల మీద పెడుతుంది అని బలవంతంగా మల్లిక చేతిలో నుంచి అమ్మవారిని తీసుకొని జానకి ఇచ్చి జానకి చేతుల మీదుగా పీటల మీద పెట్టిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.!