జబర్దస్త్ లో లేడీ గెటప్ లను కూడా వదలని సుడిగాలి సుధీర్..!
First Published Dec 1, 2020, 12:32 PM IST
కేవలం రష్మీతో మాత్రమే కాకుండా సుధీర్ మీద తరచుగా అందరమ్మాయిలను గోకుతుంటాడని, పబ్బులో ఎవరో అమ్మాయితో కనబడ్డాడని ఇలా అనేక వదంతులు వ్యాపించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా సుధీర్ జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసేవారిని కూడా వదలడం లేదు అనే ఒక టాక్ బయట హల్చల్ చేస్తుంది.

తెలుగు టెలివిషన్ చరిత్రలోనే నిర్విరామంగా ప్రసారమవుతూ... ప్రేక్షకుల మన్ననలను పొందుతూ... ఎపిసోడ్ లు పెరుగుతున్న కొద్దీ వ్యూయర్స్ సంఖ్యను పెంచుకుంటూ పోతున్న కామెడీ షో జబర్దస్త్. ప్రతి వారం గురు, శుక్రవారాలు వస్తే ప్రేక్షకులు తమ రొటీన్ జీవితంలోని బాధలన్నిటిని మర్చిపోయి హాయిగా ఒక గంటపాటు నవ్వుకోవడానికి ఈ షో ని చూస్తుంటారు.

ఈ షో అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. సుధీర్ తన స్కిట్ల వల్ల కన్నా రష్మీ తో కుదిరిన కెమిస్ట్రీ వల్ల బాగా పాపులర్ అయ్యాడు. అంతే కాకుండా సుధీర్ ని కనిపించినప్పుడల్లా అమ్మాయిల వెంట తిరుగుతాడు, పబ్బుల్లో ఉంటాడు, ఎప్పుడు ఎవరినో ఒక్కరిని గోకుతుంటాడు అని పదే పదే అందరూ అనడం, ఆ పంచులు కూడా పేలుతుండడంతో అతడికి ప్లే బాయ్ అనే ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. (Pic Credit Mallemala)
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?