- Home
- Entertainment
- నా భార్య వల్లే ప్రాణాలతో ఉన్నా.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్.. ఆ విషాదం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
నా భార్య వల్లే ప్రాణాలతో ఉన్నా.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్.. ఆ విషాదం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
`జబర్దస్త్` లో తనదైన పంచ్ పాపులారిటీ పొందారు ప్రసాద్. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఆయన నవ్వుల వెనకాల పెద్ద కన్నీటి గాథ ఉంది. తాజాగా మరోసారి ఓపెన్ అయి అందరిని హృదయాలను బరువెక్కించారు ప్రసాద్.

`జబర్దస్త్` షో ఎంతో మంది కమెడీయన్లకి లైఫ్ ఇచ్చింది. ఈ షోతో తమని తాము నిరూపించుకుని సినిమాల్లో సెటిల్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వందల మంది మంచి గుర్తింపు పొందారు. అలా మంచి పాపులారిటీ తెచ్చుకున్నవారిలో పంచ్ ప్రసాద్ ఒకరు. తనదైన పంచ్‌లతో అందరిని నవ్వుస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపుని తెచ్చుకున్నారు.
`జబర్దస్త్` కమెడీయన్ల నవ్వుల వెనకాల చాలా మంది జీవితంలో కన్నీటి గాథలున్నాయి. గుండెబరువెక్కే హృదయ విదారక ఘటనలున్నాయి. పంచ్ ప్రసాద్ లైఫ్‌లోనూ అలాంటి కన్నీళ్లే ఉన్నాయి. ఆయన కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో ప్రాణాలతో ఉండటం కష్టమే అని వైద్యులు తెలిపారు. ఆర్థికంగానూ ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి టైమ్‌లో ఆయన భార్య, జబర్దస్త్ తోటి కమెడీయన్లు, నాగబాబు ఇలా అంతా కలిసి ఆయనకు అండగా నిలిచారు.
ఇదే విషయాన్ని పంచ్ ప్రసాద్ గతంలో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. జబర్దస్త్ తనకు జీవితాన్నిచ్చిందని పేర్కొన్నారు. తన తోటి వారి సహాయాన్ని మర్చిపోలేనిదని ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఆయన మరోసారి ఓపెన్ అయ్యారు. ఈటీవీలోని `సీతారాముల కళ్యాణం చూతము రారండి` స్పెషల్ షోలో మరోసారి తన కన్నీటి గాథ పంచుకున్నారు ప్రసాద్.
తన భార్య వల్లే తాను ఇప్పుడు బతికి ఉన్నానని తెలిపారు. ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడది ఉంటుందంటారు. నా బతుకు వెనకాలే మా ఆవిడ ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. తనిప్పుడు నవ్విస్తున్న ఆ నవ్వుల వెనకాలు తన భార్య ఉందని ఆయన చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడిది ఆడియెన్స్ హృదయాలను కదిలిస్తుంది. పంచ్ ప్రసాద్.. వెంకీ మంకీస్ టీమ్‌లో నటిస్తున్నారు. మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. తను అనారోగ్యంతో పోరాడి మళ్లీ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో ఆయన భార్య చేసిన సేవలు మర్చిపోలేనివని ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే.
ప్రసాద్ తన భార్యతో కలిసి గతంలో ఓ షోలో పాల్గొన్నారు. ఇందులో తమ ప్రేమ, తమ ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పి అందరినీ ఏడిపించేశారు. తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి వరకు వెళ్లామని, ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని ప్రసాద్ చెప్పుకొచ్చారు. నాకు కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఈ అబ్బాయి కిడ్నీ సమస్య ఉంది.. ఎక్కువ రోజులు ఉండరు.. రిస్క్ ఎందుకు.. ఎంగేజ్మెంటే కదా?అయింది.. అంటూ డాక్టర్ ఆమెకు సలహాలు ఇచ్చారు. ఏడాది బతికినా రెండేళ్లు బతికినా చాలు ఆయనతోనే బతుకుతాను అని చెప్పింది` అని ప్రసాద్ అసలు విషయం చెప్పేశారు.
దీనిపై రాంప్రసాద్ చెబుతూ, ప్రసాద్‌కి ఇంకా కిడ్నీ ఆపరేషన్ చేయలేదని, వాళ్ల పిల్లాడు కాస్త ఎదిగిన తరువాత ఆమే వీడికి కిడ్నీ ఇస్తుంది` అని తెలిపారు. అంటే తన భార్యే తనకు జీవితాన్నిస్తుందని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు తన బతుకు వెనకాల తన భార్య ఉందని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.