`కిచ్చ` సుదీప్ గెస్ట్ గా ఇఫీ 51వ వేడుకలు.. మోహన్‌లాల్, రణ్వీర్ వర్చువల్ సందేశం..
First Published Jan 17, 2021, 8:28 AM IST
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) 2021 వేడుక శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ 51వ ఇఫీ వేడుకకి గోవా వేదికైంది. గోవాలోనే ఈ వేడుకని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ సుదీప్ మెయిన్ గెస్ట్ గా, కేంద్ర సమాచార,ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ అతిథులుగా పాల్గొని ఈ చిలన చిత్రోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ నెల 16 నుంచి 24 వరకు ఎనిమిది రోజులపాటు ఇఫీ వేడుకని నిర్వహించనున్నారు. గోవాలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం అందుకు వేదికైంది.

జనరల్‌గా ఇది గతేడాది నవంబర్లోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా వాయిదా వేశారు. శనివారం నుంచి ప్రారంభించారు.

మోహన్‌లాల్, రణ్వీర్ సింగ్, మాధురీ దీక్షిత్, అనిల్ కపూర్, విక్కీ కౌశల్, విద్యా బాలన్, అనుపమ్ ఖేర్, సిద్ధాంత్ చతుర్వేది వంటి సెలబ్రిటీలు వర్చువల్ మీట్లో విషెస్ తెలియజేశారు.

ఇందులో పనోరమా కేటగిరిలో పోటీపడే సినిమాలకు అవార్డులు అందిస్తారు. దీనికి గాను తెలుగు నుంచి కొత్త దర్శకుడు రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ `గతం` సినిమా ఎంపికైన విసయం తెలిసిందే.

అలాగే తమిళం నుంచి ధనుష్ నటించిన `అసురన్`, హిందీలో సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ నటించిన `చిచ్చోర్` ఎంపికైన వాటిలో ప్రధానంగా ఉన్నాయి. మొత్తంగా 183 సినిమాలు ఎంపికయ్యాయి.

ప్రారంభ ఉపన్యాసం చేసిన స్టార్ కిచ్చా సుదీప్ తన ఇన్స్పైరింగ్ లైఫ్ జర్నీని వివరించారు. నిబద్దత, ప్యాషన్, కష్టపడే తత్వం, ప్రతిభతోనే సినిమాల్లో రాణించడం సాధ్యమన్నారు. విభిన్న కళలను ప్రోత్సహించే ఇలాంటి చిత్రోత్సవాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవాలని, ఇలాంటి వేడుకని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇందులో కేవలం మన ఇండియాకి చెందిన సినిమాలే కాదు, అంతర్జాతీయ సినిమాలు కూడా ప్రదర్శించబడతాయి. సినిమాల్లో సాంకేతికంగా వస్తోన్న మార్పులు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుంది.
