‘ది గోట్’తెలుగు వెర్షన్ నష్టం అన్ని కోట్లా? షాకింగ్
ఈ సినిమాని తెలుగులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ వింగ్ 'మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి' (Mythri Distributors LLP) భారీ స్థాయిలో రిలీజ్ చేసింది.
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay)తో డైరక్టర్ వెంకట్ ప్రభు రూపొందించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The Greatest of All Time Movie) భారీ అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. అయితే ఊహించని విధంగా ఈ సినిమా డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాని తెలుగులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ వింగ్ 'మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి' (Mythri Distributors LLP) భారీ స్థాయిలో రిలీజ్ చేసింది.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్, ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ విషయంలో భారీ డిజాస్టర్ దిశగా సాగుతోంది.మైత్రీ మూవీస్ రూ.16 కోట్లకు గోట్ మూవీ రెండు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసారు. అయితే సినిమా ఎక్కడా పికప్ అవ్వటం లేదు . కలెక్షన్స్ కనపడటం లేదు.
సినిమాలో చెప్పుకోదగ్గ విషయం లేకపోవటం, వర్షాలు, వరదలు ఈ సినిమాని దెబ్బతీసాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణాలో 13 కోట్లు వరకూ నష్టపోయే అవకాసం ఉందని తెలుస్తోంది. తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించటం కష్టమే అని తేలిపోయింది.
విజయ్ గత చిత్రం వారసుడుకి తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత కావటంతో ఈ సినిమా 12 కోట్లు వరకూ వసూలు చేసింది. ఇక లోకేష్ కనకరాజ్ తో చేసిన లియో చిత్రం తెలంగాణా, ఆంధ్రాలో కలిపి 20 కోట్లు దాకా వసూలు చేసింది. దాంతో విజయ్ సినిమాలపై పెట్టుబడి పెడితే బాగానే వస్తాయనే నమ్మకం బయ్యర్లులలో కలిగింది.
ది గోట్ తో హాట్రిక్ కొడతారని అందరూ భావించారు. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన ప్లాఫ్ అయ్యింది. క్రితం సారి సితార ఎంటర్టైన్మెంట్ వారు లియోతో బాగానే సొమ్ము చేసుకున్నారు కానీ మైత్రీ వారికి ఆ అదృష్టం లేదు.
The GOAT
అప్పటికి సినిమా నిండా క్యామియోలు, సర్పైజ్ ఎలిమెంట్స్ ని నింపేసారు. ఆడియన్స్ వాటిని చూసి అసలు కథని మర్చిపోయి మరీ మురిసిపోతారనుకుంటే అది జరగటం లేదు. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అసలు కనపడటం లేదు.
The GOAT
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాలో ‘డీ-ఏజింగ్’ టెక్నాలజీని వినియోగించారు. దీని సాయంతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు.
తమిళ చరిత్రలోనే భారీస్థాయిలో (తమిళనాడులో ఉన్న దాదాపు అన్ని థియేటర్లలో) ఈ సినిమా విడుదలై రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం ఇండియాలోనే రూ.135 కోట్లు సాధించింది.
GOAT Movie
అయితే ‘ది గోట్’చిత్రం తమిళనాడు,ఓవర్సీస్ లో అదరకొడుతున్నా మిగతా చోట్ల పెద్దగా ఆ ఇంపాక్ట్ కనపడటం లేదు. కర్ణాటక,నార్త్ ఇండియాలో సినిమా జస్ట్ ఓకే అన్నట్లుగా కలెక్షన్స్ సంపాదిస్తోంది.
తెలుగు, కేరళ కు వచ్చేసరికి పూర్తి డ్రాప్ కనపడి , డిజాస్టర్ గా ముగిస్తోంది. ఇప్పటిదాకా ఏ పెద్ద సినిమాకు ఇలాంటి పరిస్దితి ఎదురుకాలేదు. ఈ సినిమా కేరళ, తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాలను చవిచూసింది.
GOAT Movie Review
చిత్రం కథేమిటంటే...దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ ఏజెంట్ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో అతను ఓ మిషన్‌లో తన కొడుకును కోల్పోవలసి రావడం.. కొద్ది కాలనికే ఆ కొడుకే 15ఏళ్ల తర్వాత తన పాలిట యముడిలా మారి దేశానికి పెను సమస్యలా మారడం.. ఈ క్రమంలో అతని ఆట కట్టించేందుకు ఆ తండ్రి ఏం చేశాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం.
నిజానికి ఈ కథ (GOAT Movie Story)లో పెద్దగా కొత్తదనమేమీ లేకున్నా.. స్క్రీన్‌ప్లే స్పెషలిస్ట్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన సినిమా (GOAT Movie) కావడంతో దీంట్లో తప్పకుండా ఓ మ్యాజిక్ కనిపిస్తుందన్న భరోసా ప్రేక్షకుల్లో కపిస్తుంది. అయితే అలాంటిది జరగలేదు.