నేను పక్కా లోకల్ అంటూ.. సెగలు రేపుతున్న అనసూయ
అనసూయ గ్లామర్ ఫోటోలతోనే కాదు.. కవ్వించే డాన్సులతోనూ అభిమానులకు నిద్రలు లేకుండా చేయగలనని మరోసారి నిరూపించింది. `నేను పక్కా లోకల్` అంటూ సెగలు రేపుతుంది.
అనసూయ ఓ వైపు సినిమాలు, మరోవైపు హోస్ట్ గా ఫుల్ బిజీగా ఉంది. సమయం వచ్చినప్పుడల్లా స్పెషల్ ఈవెంట్స్ లోనూ పాల్గొంటూ అలరిస్తుంది.
దసరా కానుకగా ఇప్పుడు అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. అందులో భాగంగా జీతెలుగులోనూ `చి.ప్రదీప్‌కి చి.ల.సౌ శ్రీముఖి రాయునది ఏమనగా` అంటూ ఓ స్పెషల్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు.
ఇందులో హాట్ యాంకర్ అనసూయ `నేను పక్కా లోకల్` అనే సాంగ్‌కి స్టెప్పులేసింది. నడుమందాల షో చేస్తూ, నడుము వంపులతో మత్తెక్కిస్తూ డాన్స్ చేసింది.
అదిరిపోయే డాన్స్ తో షేక్ చేసింది. ఐటెమ్ గర్ల్ గా అందాలు, హవభావాలు ఒలకబోస్తూ ఆమె డాన్సులు అభిమానుల్లో సెగలు రేపుతుంది. ఈ సాంగ్ వీడియోని అనసూయ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అనసూయని ఎగబడి చూస్తున్నారు. బేసిక్‌గా అనసూయ కొత్త ఫోటోలు వచ్చాయంటేనే ఎగబడి చూసే నెటిజన్లు ఇలాంటి మత్తెక్కించే వీడియో వదిలితే ఊరుకుంటారా? రెచ్చిపోయి చూస్తారు.
ఈ దసరా మొత్తం అనసూయదే సందడి అనేలా ఉంది ఈ పాట చూస్తుంటే. మరి అనసూయ రేపు ఇంకెంత స్పెషల్‌గా కనిపిస్తుందో చూడాలి.