- Home
- Entertainment
- ఎన్టీఆర్‌కే ఎందుకు ఇలా జరుగుతుంది.. అత్యధిక హీరోయిన్లు రిజెక్ట్ చేసిన హీరోగా తారక్.. ఫైనల్‌గా సెట్ ?
ఎన్టీఆర్‌కే ఎందుకు ఇలా జరుగుతుంది.. అత్యధిక హీరోయిన్లు రిజెక్ట్ చేసిన హీరోగా తారక్.. ఫైనల్‌గా సెట్ ?
ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు, డాన్సులకు కేరాఫ్. ఆయన సినిమాల్లో హీరోయిన్లకి మంచి ప్రయారిటీనే ఉంటుంది. కానీ ఆయన్ని హీరోయిన్లంతా రిజెక్ట్ చేయడమే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది.

ఎన్టీఆర్(NTR) ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్`తో మెప్పించారు. అందులో బ్రిటీష్ నటితో రొమాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలోని తారక్ నటనకు ప్రపంచ సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆస్కార్ పోటీలోనూ ఉన్నారు. వరల్డ్ వైడ్‌గా ఇంతటి క్రేజ్‌ని సొంతం చేసుకున్న తారక్.. హీరోయిన్ల విషయంలో మాత్రం ఇప్పుడు అయోమయంలో పడ్డాడు. ఆయన్ని వాళ్లు రిజెక్ట్ చేయడం షాక్ కి గురి చేస్తుంది.
తారక్ ప్రస్తుతం కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో తన `NTR30` సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అత్యంత సస్పెన్స్ మధ్య డిలే అవుతూ వస్తోంది. ఫైనల్‌గా సినిమా ప్రారంభానికి ముహుర్తం ఖరారు చేశారు. ఫిబ్రవరిలో సినిమాని స్టార్ట్ చేయబోతున్నారట యూనిట్. ఇటీవలే యువసుధ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఆఫీస్‌ని కూడా ఓపెన్ చేశారు. కొరటాల సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి మరో పెద్ద సమస్య వెంటాడుతుంది. ఏడాది కాలంగా చూస్తున్నా ఇందులో నటించేందుకు హీరోయిన్లు వరుసగా నో చెప్పడమే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా ఆరుగురు హీరోయిన్లు అఫీషియల్‌గా రిజెక్ట్ చేశారు. అన్ ఆఫీషియల్‌గా మరో ఇద్దరు ముగ్గురు ఈ జాబితాలో ఉంటారని టాక్. ఎన్టీఆర్30లో మొదట అలియాభట్ హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమె కూడా ఆల్మోస్ట్ ఓకే అని చెప్పింది. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ వేట సాగిస్తూనే ఉన్నారు దర్శకుడు కొరటాల.
కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో చర్చిస్తున్నారని అన్నారు. కానీ కొన్ని రోజులకే ఆమె చేసేందుకు ఒప్పుకోలేదనే టాక్ బయటకు వచ్చింది. మరోవైపు ఆ తర్వాత దీపికా పదుకొనె అనుకున్నారు. ఇప్పటికే ఆమె ప్రభాస్ తో `ప్రాజెక్ట్ కే` లో నటిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌తోనూ నటింప చేయాలనుకున్నారు. కానీ దీపికా సైతం రిజెక్ట్ చేసింది. మరోవైపు కీర్తిసురేష్ వరకు వెళ్లింది. ఆమె కూడా ఈ పాత్ర తాను చేయలేనని చెప్పేసిందట. పూజా హెగ్డే పేరు కూడా పరిశీలించారు. కానీ పూజా సైతం నో చెప్పిందంటూ ప్రచారం జరిగింది.
జాన్వీ కపూర్(Janhvi Kapoor) వరకు వెళ్లిందట. ఆమె కూడా అంతగా ఆసక్తి చూపించలేదని సమాచారం. అలాగే రష్మిక మందన్నాతోనూ ఈ సినిమాకి సంబంధించిన చర్చలు జరిపారు. అయితే తన డేట్స్ కుదరకపోవడంతో చేయలేని స్థితిలో ఉందట. దీంతో మళ్లీ జాన్వీ కపూర్ దగ్గరే ఆగిపోయిందని తెలుస్తుంది. ఆమెతోనే ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం. ఆమె ఓకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా ఏడో హీరోయిన్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చిందని టాక్. మరి ఆమె అయినా ఓకే అంటుందా? మళ్లీ మొదటికి వస్తుందా? అనేది చూడాల్సి ఉంది. NTR Heroines.
అయితే ఇంతమంది హీరోయిన్లు రిజెక్ట్ చేసిన హీరోగా ఎన్టీఆర్ నిలవడం విశేషం. సీనియర్లైనా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలకు హీరోయిన్లు దొరుకుతున్నారు. ఒకరిద్దరితోనూ ఎవరినో ఒకరిని ఓకే చేస్తున్నారు. కానీ తారక్ విషయంలో ఇలా జరగడం ఆశ్చర్యపరుస్తుంది. దీంతో ఓ విచిత్రమైన పరిస్థితిలో ఎన్టీఆర్ ఉన్నారని చెప్పొచ్చు. మరి హీరోయిన్లకి ఇందులో ప్రయారిటీ ఉండదా? లేక బోల్డ్ గా ఉంటుందా? అనేది సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. మొత్తంగా ఎన్టీఆర్30 హీరోయిన్ అంటేనే ఆమడదూరంకి పారిపోతున్నారు కథానాయికలు.
ఇదిలా ఉంటే ఈ సినిమా వాటర్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుందని తెలుస్తుంది. సినిమా ఫిబ్రవరిలో ప్రారంభించబోతున్న నేపథ్యంలో సినిమా డిటెయిల్స్ ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల చేయబోతున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ అమెరికా టూర్ వెళ్లారు. వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చాక ఈ సినిమాని స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం.