Samantha: ఆధ్యాత్మిక బాటలో సమంత... చికిత్సకు ముందు ధైర్యం కోసమేనా?
హీరోయిన్ సమంత ఖుషి, సిటాడెల్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఖాళీగా ఉన్న సమంత తన సమయాన్ని పుణ్యక్షేత్రాల దర్శనానికి కేటాయిస్తున్నారు.

Samantha
సమంత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఇటీవల ఆమె ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ పూర్తి చేశారు. గత ఏడాది సమంత ఈ రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ఖుషి షూటింగ్ సమంత అనార్యోగం బారిన పడటంతో ఆగిపోయింది. మయోసైటిస్ సోకినట్లు ప్రకటించిన సమంత నెలల పాటు ఇంటికి పరిమితమయ్యారు. కొంతమేర కోలుకున్న సమంత తిరిగి నటించడం స్టార్ట్ చేశారు. మిగిలి ఉన్న ఖుషి చిత్రీకరణ పూర్తి చేశారు. ద్రాక్షారామంలో విజయ్ దేవరకొండ-సమంత మీద పతాక సన్నివేశాలు చిత్రీకరించారు.
ఇక జులై 13న సిటాడెల్ షూట్ కూడా కంప్లీట్ చేసింది. ఆరు నెలలు కష్టంగా గడిచాయని సమంత తెలియజేశారు. ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ లో నిరవధికంగా పాల్గొన్న సమంత కష్టం మీద ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా ఏడాది పాటు సమంత విరామం తీసుకోనున్నారట. సమంత ఎలాంటి ప్రాజెక్ట్స్ కి సైన్ చేయకూడదని నిర్ణయించుకున్నారట.
ఏడాది కాలాన్ని ఆమె చికిత్స కోసం కేటాయించనున్నారని సమాచారం. అందుకు సమంత అమెరికా వెళుతున్నారట. అక్కడే కొన్ని నెలల పాటు ఉంటారట. సమంత వైద్యానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందట. సమంత చికిత్స కోసం అమెరికా వెళుతున్న మాట నిజమేనా అనే సందేహాలు ఉన్నాయి. ఆమె మిత్రుడు హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ బత్కర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. పరోక్షంగా నిజమే అని తెలియజేశాడు .
Samantha
కొద్దిరోజుల్లో అమెరికా ప్రయాణం ఉండగా సమంత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో గల వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్లారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. కీలకమైన చికిత్సకు ముందు సమంత మనో ధైర్యం కోసం ఇష్ట దైవాల దర్శనం చేసుకుంటారని తెలుస్తుంది. సమంత డివోషనల్ లుక్ ఆకట్టుకోగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
క్రిస్టియన్ అయిన సమంత హిందూమతాన్ని కూడా ఆచరిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సమంత జగద్గురు జగ్గీ వాసుదేవ్ శిష్యురాలు. ఆయన ఉపదేశాలను పాటిస్తారు. ఆ మధ్య జగ్గీ వాసుదేవ్ చూపించిన అబ్బాయిని సమంత రెండో వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. 2021 అక్టోబర్ లో సమంత భర్త నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.