Samantha: సరైన పార్టనర్ కావాలి, వెతుకుతున్నాను... సంచలనంగా సమంత పోస్ట్!
కరెక్ట్ జోడి కోసం వెతుకుతున్నామని సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. సింగిల్ స్టేటస్ అనుభవిస్తున్న సమంత కామెంట్ వైరల్ అవుతుంది.
Samantha
సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన మనసులోని భావాలు, సినిమా అప్డేట్స్ పంచుకుంటారు. సోషల్ ఇష్యూస్ మీద కూడా స్పందిస్తారు. తాజాగా సమంత చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె రైట్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నామని ఓ కామెంట్ చేశారు.
Samantha
అయితే ఆమె పార్ట్నర్ ని వెతుకుతుంది తన కోసం కాదు. తన సన్నిహితుడు కోసం. డాక్టర్ జెవెల్ గమాడియాకు మంచి జోడీ కావాలట. అతని ఫోటో షేర్ చేసిన సమంత జోడీ కావాలన్నారు. అలాగే డాక్టర్ గమాడియా లక్షణాలు కూడా సుచాయిగా చెప్పారు. పైకి కనిపించే దానికంటే తెలివైనవాడు అంటూ మరో కామెంట్ చేసింది. సమంత పోస్ట్ వైరల్ అవుతుంది.
Samantha
ఈ క్రమంలో సమంత సంబంధాలు కూడా చూస్తున్నారా? అని కొందరు వాపోతున్నారు. ఇంతకీ ఎవరీ డాక్టర్ గమాడియా అంటే ... వెస్ట్రన్ అక్యుపెంచర్ నిపుణుడు. ఇతడు సెలెబ్రిటీ వైద్యుడు. కత్రినా కైఫ్ తో పాటు పలువురు స్టార్స్ డాక్టర్ గమాడియా వద్ద ట్రీట్మెంట్ తీసుకున్నారు. సమంతకు కూడా గమాడియా వైద్యం చేసినట్లు సమాచారం.
ఇక సమంత సిటాడెల్ ఏక్షన్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. బోల్డ్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని సమాచారం. శృంగార సన్నివేశాల్లో నటించేందుకు చాలా ఇబ్బందిపడ్డానని ప్రియాంక చోప్రా నేరుగా చెప్పారు. ఏప్రిల్ 28 నుండి సిటాడెల్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.
ఈ క్రమంలో వరుణ్ ధావన్-సమంత మధ్య ఆ తరహా సన్నివేశాలు ఉండనున్నాయి. అయితే ఇండియన్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని డోసు కొంచెం తగ్గించి ఉండవచ్చు. సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
Image: Samantha Ruth Prabhu / Instagram
ప్రస్తుతం సమంత సిటాడెల్ తో పాటు విజయ్ దేవరకొండ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ ఖుషి టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మజిలీ చిత్రం చేశారు. అది సూపర్ హిట్ కొట్టింది.
Image: Samantha Ruth Prabhu / Instagram
ఇక శాకుంతలం మూవీతో సమంతకు భారీ షాక్ తగిలింది. సమంత కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా శాకుంతలం నిలిచింది. దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. శాకుంతలం మూవీతో దిల్ రాజు పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి.