చైతూతో విడాకులు అయ్యాక ఏమైందో చెప్పిన సమంత! మయోసైటిస్ కి కారణం అదేనా!
సమంత కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు. ఆమెకు కొంత విరామం దొరికింది. దీంతో హెల్త్ పాడ్ క్యాస్ట్ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కాగా, విడాకుల తర్వాత ఏం జరిగిందో ఆమె వెల్లడించారు.
సమంత భర్తకు దూరమై చాలా కాలం అవుతుంది. పలు సందర్భాల్లో నాగ చైతన్యతో విడాకులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సమంత మాట్లాడింది. మరోసారి విడాకుల తర్వాత తన కండిషన్ ఏమిటో సమంత వెల్లడించింది. మయో సైటిస్ సోకడానికి ముందు ఏడాది పాటు కష్టంగా గడిచిందని చెప్పుకొచ్చింది.
సమంత తాజాగా టేక్ 20 పేరుతో ఒక హెల్త్ పాడ్ క్యాస్ట్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఎపిసోడ్ లో ఆమె ఆటో ఇమ్యూనిటీ సమస్య పై ఎక్స్పర్ట్ అల్కేష్ తో మాట్లాడింది. ఆయన ఆటో ఇమ్యూనిటీకి గల కారణాలు, ప్రివెన్షన్ మెథడ్స్ వివరించారు. ఆధునిక జీవన శైలి కారణంగా శరీరంలోకి విష తుల్యం మోతాదుకు మించి పోతుంది అన్నారు.
శరీరంలోకి వచ్చే విష తుల్యానికి బయటకు పోయే విష తుల్యానికి మధ్య బ్యాలన్స్ తప్పినప్పుడు మయోసైటిస్ వంటి సమస్య ఏర్పడుతుందని ఆయన అన్నారు. కిచెన్ వేర్, కాస్మటిక్స్, దుస్తులు కూడా ఇందుకు కారణం అవుతున్నాయని వెల్లడించారు.
ఈ క్రమంలో సమంత మాట్లాడుతూ... ఆహారం విషయంలో నేను అత్యంత జాగ్రత్త వహిస్తాను. అయినప్పటికీ నాకు ఆటో ఇమ్యూనిటీ సమస్య వచ్చింది. అది మయోసైటిస్ కి దారి తీసింది. మయోసైటిస్ రావడానికి ముందు ఏడాది కాలం చాలా కష్టంగా గడిచింది, అన్నారు.
సమంత మాటలు పరిశీలిస్తే నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె ఏడాది పాటు వేదన అనుభవించారని తెలుస్తుంది. సమంత పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించింది. 2021 అక్టోబర్ లో సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేశారు. 2022 చివర్లో సమంత తనకు మయోసైటిస్ సోకిన విషయం వెల్లడించింది.
విడాకులు సమంతకు కృంగదీశాయి. కోరుకున్నవాడు దూరమైన బాధ ఒకవైపు.. అవమానాలు, అపవాదులు మరొక వైపు. డిప్రెషన్ నుండి బయటపడేందుకు సమంత మిత్రులతో గడిపింది. ఆధ్యాత్మిక యాత్రలు చేసింది...