Pooja Hegde: థండర్ థైస్ కనిపించేలా పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్... క్రేజీ కామెంట్స్ తో కుర్రాళ్ళ రచ్చ!
ఓ ఈవెంట్ కోసం సూపర్ హాట్ గా తయారైంది పూజా హెగ్డే. థైస్ కనిపించేలా టైట్ బాడీ కాన్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Pooja Hegde
ఇటీవల పూజా హెగ్డేకు సర్జరీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. కాలినొప్పితో బాధపడుతున్న పూజా సర్జరీ చేయించుకున్నారని సదరు కథనాల సారాంశం. పూజా కొన్ని ప్రాజెక్ట్స్ నుండి తప్పుకోవడానికి కూడా కారణం ఇదే అంటున్నారు.
Pooja Hegde
మరోవైపు పూజా హెగ్డే(Pooja Hegde)కు బ్యాడ్ టైం నడుస్తుంది. కొత్త ఆఫర్స్ రాకపోగా వచ్చినవి కూడా చేజారుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ గుంటూరు కారం నుండి ఆమె తప్పుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఆమె రోల్ ప్రాధాన్యత తగ్గించి సెకండ్ హీరోయిన్ చేశాడట. దాంతో తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి గుంటూరు కారం కి గుడ్ బై చెప్పేసింది.
Pooja Hegde
మహేష్ బాబు తనను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారనుకుంటే ఆ ఆశ కూడా చేజారింది. గత ఏడాది ఇలానే జనగణమన అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోల్పోయింది. నిర్మాతలు హ్యాండ్ ఇవ్వడంతో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ ల డ్రీమ్ ప్రాజెక్ట్ అటకెక్కింది.
Pooja Hegde
పూజా హెగ్డే కెరీర్ ప్రమాదంలో పడింది. వరుసగా ఆరు ప్లాప్స్ పడ్డాయి. పూజా లేటెస్ట్ రిలీజ్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ నిరాశపరిచింది. సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పరాజయం నేపథ్యంలో పూజా డిప్రెషన్ కి గురయ్యారని సమాచారం.
Pooja Hegde
2022లో ఆమెకు వరుస షాకులు తగిలాయి. ఒకదానికి మించిన మరో డిజాస్టర్ పూజా ఖాతాలో చేరాయి. రాధే శ్యామ్ మూవీతో ఆమె సక్సెస్ గ్రాఫ్ పడుతూ వచ్చింది. నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్లో భారీ నష్టాలు మిగిల్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. వందల కోట్ల నష్టం రాధే శ్యామ్ మిగిల్చింది.
రాధే శ్యామ్ ఫెయిల్యూర్ నుండి బయటపడే లోపే మరో డిజాస్టర్ పలకరించింది. రాధే శ్యామ్ కి మించిన పరాజయం ఆచార్య చవిచూసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ రెండో రోజే థియేటర్స్ నుండి ఎత్తేస్తారు. ఏప్రిల్ లో విడుదలైన ఆచార్య పూజాకు ఊహించని షాక్ ఇచ్చింది.రాధే శ్యామ్, ఆచార్య చిత్రాల మధ్యలో ఆమెకు మరో ప్లాప్ పడింది.
విజయ్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. రాధే శ్యామ్, ఆచార్యలతో పోల్చుకుంటే నష్టాలు తక్కువే అయినప్పటికీ ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన ప్లాప్ మూవీగా బీస్ట్ రికార్డులకు ఎక్కింది. బాలీవుడ్ చిత్రం సర్కస్ వీటన్నింటినీ మించిన డిజాస్టర్ అయ్యింది. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన సర్కస్ వరస్ట్ ఫిల్మ్ గా ప్రేక్షకులు అభివర్ణించారు.