- Home
- Entertainment
- సెల్ఫీలతో ఆల్మోస్ట్ పడగొట్టేసిన నివేతా పేతురాజ్.. క్యాజువల్స్ లోనూ కేక పెట్టిస్తున్న యంగ్ బ్యూటీ!
సెల్ఫీలతో ఆల్మోస్ట్ పడగొట్టేసిన నివేతా పేతురాజ్.. క్యాజువల్స్ లోనూ కేక పెట్టిస్తున్న యంగ్ బ్యూటీ!
యంగ్ హీరో విశ్వక్ సేన్ సరసన ‘దాస్ కా ధమ్కీ’లో నటిస్తోంది హీరోయిన్ నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj). త్వరలోనే ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఈ క్రమంలో నివేతా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

తమిళ బ్యూటీ నివేతా పేతురాజ్ కు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులలోనూ మంచి గుర్తింపు దక్కింది. టాలెంటెడ్ హీరోయిన్ గా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటోంది.
ప్రస్తుతం యంగ్ హీరో విశ్వక్ సేన్ సరసన ‘దాస్ కా ధమ్కీ’లో నటిస్తోంది కుర్ర హీరోయిన్ నివేతా పేతురాజ్. వచ్చే నెల 17న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోందీ చిత్రం. ఈ సందర్భంగా మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు.
మరోవైపు నివేతా పేతురాజ్ కూడా తన సినిమాలను ఈసారి గట్టిగా ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసమే ఇప్పటి నుంచే అభిమానులు, నెటిజన్లతో సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ తెగ సందడి చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా నివేతా మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది. బ్యూటీఫుల్ లోకేషన్ లో రెడ్ టీషర్ట్ లో దర్శనమిచ్చింది. కాజువల్ లుక్ లోనూ చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తోంది. సూర్య కిరణాల తాకిడికి మరింతగా మెరిసిపోతూ ఆకట్టుకుంటోంది.
స్టన్నింగ్ ఫొటోషూట్లతో రచ్చరచ్చ చేసే ఈ బ్యూటీ.. కాజువల్స్ లోనూ అందాలను సెల్ఫీల్లో బంధించి ఆల్మోస్ట్ పడగొట్టేసిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. యంగ్ బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.
చివరిగా ‘బ్లడీ మేరీ’,‘విరాటపర్వం’తో అలరించిన నివేతా పేతురాజ్ ప్రస్తుతం ‘దాస్ కా ధమ్కీ’కితో అలరించబోతోంది. విశ్వక్ సేన్ తో ఇప్పటికే పాగల్ చిత్రంతో అలరించిన ఈ బ్యూటీ మరోసారి ఆకట్టుకోబోతోంది.