టాప్ లేకుండా కెమెరా ముందుకు వచ్చిన నిధి అగర్వాల్... హరి హర వీరమల్లు హీరోయిన్ తెగింపు!
హీరోయిన్ నిధి అగర్వాల్ టాప్ లెస్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. క్రేజీ హీరోయిన్ తెగింపుకు జనాలు అవాక్కు అవుతున్నారు. నిధి గ్లామరస్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
Nidhhi Agarwal
నిధి అగర్వాల్ చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇకటి హరి హర వీరమల్లు కాగా, మరొకటి రాజా సాబ్. హరి హర వీరమల్లులో పవన్ కళ్యాణ్ కి జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది.
హరి హర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ బందిపోటు గా కనిపించనున్నారు. అయితే అనుకోని కారణాలతో ఈ చిత్ర షూటింగ్ నత్తనడక సాగుతుంది.
హరి హర వీరమల్లు ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే సూచనలు కలవు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రభాస్ కి జంటగా రాజా సాబ్ మూవీ చేస్తుంది.
రాజా సాబ్ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్ది కుమార్ సైతం హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. రాజా సాబ్ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.
ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి తనకు బ్రేక్ ఇస్తుందని నిధి అగర్వాల్ నమ్మకంతో ఉంది. నిధి అగర్వాల్ 2017లో నటిగా కెరీర్ ఆరంభించింది. 2018లో నాగ చైతన్యకు జంటగా సవ్యసాచి చిత్రం చేసింది.
Nidhhi Agarwal
సవ్యసాచి డిజాస్టర్ కాగా, అఖిల్ కి జంటగా మిస్టర్ మజ్ను లో నటించింది. అది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. నిధి అగర్వాల్ కెరీర్లో ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్ మూవీగా ఉంది.