- Home
- Entertainment
- కోటు బటన్స్ తీసేసి సూపర్ హాట్ గా మృణాల్... సీతారామం బ్యూటీని ఇలా చూసి తట్టుకోవడం కష్టమే!
కోటు బటన్స్ తీసేసి సూపర్ హాట్ గా మృణాల్... సీతారామం బ్యూటీని ఇలా చూసి తట్టుకోవడం కష్టమే!
సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కోట్ అండ్ ప్యాంట్స్ ధరించి సూపర్ స్టైలిష్ గా కనిపించింది. ఈ స్టార్ లేడీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

Mrunal Thakur
మృణాల్ ఠాకూర్ సైమా వేడుకల కోసం దుబాయ్ వెళ్లారు. సైమా అవార్డ్స్ ఈవెంట్ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఘనంగా జరగనుంది. సైమా ఈవెంట్ అనౌన్స్మెంట్ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. ఇందు కోసం కోట్ అండ్ ప్యాంట్స్ ధరించిన మృణాల్ సూపర్ స్టైలిష్ పోజుల్లో అదరగొట్టారు.
Mrunal Thakur
గత ఏడాది విడుదలైన సీతారామం మూవీతో మృణాల్ టాలీవుడ్ లో అడుగు పెట్టారు. వస్తూ వస్తూనే సంచలనానికి తెరలేపారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం భారీ విజయం సాధించింది. పెద్దగా అంచనాలు లేని ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. హిందీలో కూడా మెరుగైన వసూళ్లు రాబట్టింది.
Mrunal Thakur
సీతారామం సక్సెస్ నేపథ్యంలో మృణాల్ కి తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. దసరా మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టిన నానికి జంటగా ఒక చిత్రం చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే విజయ్ దేవరకొండతో మరొక చిత్రం ప్రకటించారు. ఈ చిత్ర ఫలితాలపై మృణాల్ టాలీవుడ్ జర్నీ ఆధారపడి ఉంటుంది.
Mrunal Thakur
ఇక మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ అయ్యారు.మరాఠీ చిత్రం విట్టి దండు తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మృణాల్ కి హిందీ మూవీ లవ్ సోనియా బ్రేక్ ఇచ్చింది. అనంతరం సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాల్లో నటించి పాపులారిటీ రాబట్టారు.
Mrunal Thakur
కాగా వెండితెర ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో అవమానాలు ఎదురయ్యాయని మృణాల్ గతంలో చెప్పారు. మట్టి కుండ మాదిరి నల్లగా ఉన్నావు అనేవారట. మట్కా(కుండ) అని నిక్ నేమ్ కూడా పెట్టారని మృణాల్ ఆవేదన చెందారు.
Mrunal Thakur
సీరియల్ నటి అనగానే తక్కువ భావనతో చూసేవారు. కొన్ని భారీ ప్రాజెక్ట్స్ నుండి తప్పించారంటూ ఆమె వెల్లడించారు. లవ్ సోనియా మూవీతో మృణాల్ కి బ్రేక్ వచ్చింది. సూపర్ 30, బాట్లా హౌస్ చిత్రాలతో నిలదొక్కుకుంది.
Mrunal Thakur
ప్రేమ, పెళ్లి పట్ల మృణాల్ భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. థర్టీ ప్లస్ లో ప్రేమ వ్యవహారాలు ఒత్తిడికి గురి చేస్తాయన్నారు. ఇక పిల్లలను పొందాలనే ఆశ ఉంది కానీ, పెళ్లి చేసుకోను అన్నారు. ఈ రోజుల్లో పిల్లల కోసం పెళ్లి తప్పని సరి కాదని చెప్పడం విశేషం.