Lavanya Tripathi: గాల్లో తేలియాడుతున్న లావణ్య త్రిపాఠి... డ్రెస్ ఎగిరిపోవడంతో బయటపడ్డ పరువాలు!
లావణ్య త్రిపాఠి లేటెస్ట్ గ్లామరస్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ట్రెండీ వేర్ ధరించి సూపర్ హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేశారు. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Lavanya Tripathi
ఆఫర్స్ తగ్గడంతో లావణ్య గ్లామర్ షోకి తెరలేపుతున్నారు. హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న లావణ్య ఇప్పుడు పంథా మార్చారు. తనలోని హాట్నెస్ ని పరిచయం చేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది. ప్రస్తుతం లావణ్య కెరీర్ చప్పగా సాగుతుంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అన్న ఇమేజ్ తో పాటు ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోలేక పోయింది లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరింది.
Lavanya Tripathi
లావణ్య లాస్ట్ రిలీజ్ హ్యాపీ బర్త్ డే సైతం నిరాశపరిచింది. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క సినిమా లేదు. ఇటీవల పులి మేక టైటిల్ తో వెబ్ సిరీస్ చేశారు. ఏ సిరీస్లో లావణ్య పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేయడం విశేషం. పులి మేక సిరీస్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో స్టార్ హీరోయిన్ కావాలన్న కోరిక తీరకుండానే లావణ్య కెరీర్ ముగిసిన సూచనలు కనిపిస్తున్నాయి.
Lavanya Tripathi
సీరియల్ నటిగా కెరీర్ మొదలు పెట్టిన లావణ్య అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ అయ్యారు. ట్రై యాంగిల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన అందాల రాక్షసి చిత్రంలో లావణ్య నటన అద్భుతం. అల్లరి పిల్లగా లావణ్య అదరగొట్టేసింది. ఆ సినిమాతో లావణ్య ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
Lavanya Tripathi
భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరుస హిట్స్ దక్కినా, హీరోయిన్ గా బిజీ కాలేకపోయారు. టూ టైర్ హీరోలతోనే లావణ్య కెరీర్ సాగింది. కెరీర్ బిగినింగ్ లో హిట్ సినిమాలలో నటించి కూడా పునాది వేసుకోలేకపోయింది. టాలెంట్ ఉన్నా లక్ లేక రేసులో వెనుకబడిపోయింది. అర్జున్ సురవరం మూవీతో ఫార్మ్ లోకి వచ్చింది అనుకుంటే... ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలు చావు దెబ్బతీశాయి. ఈ రెండు చిత్రాలు పరాజయం కావడంతో లావణ్య కెరీర్ మరింత నెమ్మదించింది.
Lavanya Tripathi
ఆ మధ్య మెగా కోడలు పుకార్లతో వార్తల్లోకి ఎక్కింది లావణ్య త్రిపాఠి. హీరో వరుణ్ తేజ్ లావణ్యపై మనసుపడ్డారని, ఏకంగా విలువైన ఓ డైమండ్ రింగ్ తీసుకొని లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేయడానికి బెంగుళూరు వెళ్లాడని కథనాలు వెలువడ్డాయి. ఇక రాజస్థాన్ లో జరిగిన నిహారిక వెడ్డింగ్ కి కేవలం లావణ్య , రీతూ వర్మ మాత్రమే హాజరయ్యారు.
Lavanya Tripathi
ఫ్యామిలీ హీరోలతో పాటు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న నిహారిక పెళ్లి వేడుకలో లావణ్య మెరిశారు.ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న జనాలు, లావణ్యతో వరుణ్ పెళ్లి వార్తలు నమ్మారు. అయితే ఈ కథనాల్లో నిజం లేదని లావణ్య పరోక్షంగా చెప్పారు. ప్రస్తుతానికి వరుణ్-లావణ్య ఎఫైర్ రూమర్స్ సద్దుమణిగాయి.