ఓపెన్ హైమర్ ఆటం బాంబులా పేలిన కియారా అద్వానీ అందాలు... రాటుతేలిన పరువాలతో కవ్వించిన భామ!
స్టార్ లేడీ కియారా అద్వానీ పరువాలు ఆటం బాంబుకు మించి వేడితో గుండెలను తాకాయి. అమ్మడు బోల్డ్ లుక్ మైండ్ బ్లాక్ చేసింది. కియారా లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.
Kiara Advani
కోచర్ వీక్ ఓపెనింగ్ షోలో ర్యాంప్ వాక్ చేసింది కియారా అద్వానీ. పింక్ కలర్ డిజైనర్ వేర్ ధరించి కుర్రాళ్ళ మదిలో సెగలు రేపింది. కియారా బోల్డ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా, కామెంట్ బాక్స్ బద్దలవుతుంది.
Kiara Advani
కాగా కియారా అద్వానీ చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. రామ్ చరణ్ కి జంటగా ఆమె గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది విడుదల కానుంది.
Kiara Advani
శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. భారతీయుడు 2 షూటింగ్ కూడా శంకర్ పూర్తి చేయాల్సి రావడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ కొంచెం ఆలస్యం అవుతుంది. కథలో కీలకమైన పాత్ర కియారా చేస్తున్నారు. ఆమె రోల్ మెస్మరైజ్ చేస్తుందట.
Kiara Advani
రామ్ చరణ్ కి జంటగా కియారా చేస్తున్న రెండో చిత్రం గేమ్ ఛేంజర్. గతంలో వీరి కాంబోలో వినయ విధేయ రామ విడుదలైంది. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Kiara Advani
ఇక కియారా నటించిన మొదటి తెలుగు చిత్రం భరత్ అనే నేను. మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లో విడుదలైన భరత్ అనే నేను సూపర్ హిట్ కొట్టింది. కియారా గ్లామర్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
Kiara Advani
కాగా కియారా 2023 ఫిబ్రవరి 7న హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. పెళ్లికి కొన్ని రోజులు ముందు కూడా సిద్ధార్థ్, కియారా ఎఫైర్ రూమర్స్ ఖండించారు. సడన్ గా ప్రకటన చేసి పెళ్లి తంతు ముగించారు. కియారా-సిద్ధార్థ్ ల వివాహానికి జైసల్మేర్ లోని సూర్య ఘడ్ కోట వేదికైంది.
Kiara Advani
పెళ్లి కేవలం బంధు మిత్రుల మధ్య ముగిసింది. ముంబైలో చిత్ర ప్రముఖుల కోసం భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లికి ముందే కియారా తల్లి అయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి. అందులో నిజం లేదని తేలిపోయింది. వివాహం అనంతరం కూడా కియారా నటన కొనసాగిస్తున్నారు.