Eesha Rebba: నిక్కర్లో చక్కర్లు కొడుతున్న ఈషా రెబ్బా... బీచ్లో తెలుగు పిల్ల పరువాలు దాడి!
బీచ్ కనపడితే చాలు హీరోయిన్స్ అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తారు. తెలుగు భామ ఈషా రెబ్బా డెనిమ్ షార్ట్ లో సాగర తీరాన్ని హీటెక్కించింది. ఆమె బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది.
Eesha Rebba
జయాపజయాలతో సంబంధం లేకుండా ఈషా రెబ్బా పాపులారిటీ రాబట్టింది. బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గని గ్లామర్ ఆమె సొంతం. కాకపోతే కాలమే కలిసి రాలేదు. సరైన అవకాశాలు దక్కక మరుగున పడిపోయింది.
Eesha Rebba
సోషల్ మీడియాలో ఈషా పరువాల దాడి మాములుగా ఉండదు. అరాకొరా బట్టల్లో అందాల విందు చేస్తుంది. తాజాగా బీచ్లో రెచ్చిపోయింది. పొట్టి నిక్కర్లో హార్ట్ బీట్ పెంచేసింది. ఈషా లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది, నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
Eesha Rebba
ప్రస్తుతం ఈషా దయా టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. దయా ట్రైలర్ విడుదల చేయగా ఆకట్టుకుంది. దర్శకుడు పవన్ సాధినేని దయా సిరీస్ తెరకెక్కించారు. త్వరలో హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. దయా సిరీస్లో గడ్డం చక్రవర్తి ప్రధాన పాత్ర చేశారు. ఈషా ఆయన భార్య రోల్ చేస్తున్నారు. ఈషా ప్రెగ్నెంట్ ఉమెన్ గా కనిపించనుంది.
అలాగే ఈషా రెబ్బా తమిళ ప్రాజెక్ట్ ప్రకటించారు. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది.
Eesha Rebba
2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అభిజీత్ హీరోగా నటించాడు. హ్యాపీ డేస్ సక్సెస్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ మూవీ ఆ స్థాయిలో ఆడలేదు.
అనంతరం అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో మెయిన్ లీడ్ చేసింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా అంతకు ముందు ఆ తర్వాత చిత్రం తెరకెక్కింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు.
ఈ క్రమంలో బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషాకు భారీ కమర్షియల్ హిట్ పడకపోవడం మైనస్ అయ్యింది.ప్రస్తుతం ఈషాకు తెలుగులో ఫేమ్ తగ్గింది. దీంతో పర భాషల్లో సక్సెస్ కావాలని చూస్తున్నారు.
Eesha Rebba
కట్టిపడేసే అందం, నటన ఉండి కూడా లక్ అనేది ఈషాకు చిక్కలేదు. అందుకే ఆమె రేసులో వెనుకబడిపోయింది. దీనికి వివక్ష కూడా ఒక కారణం. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి బాలీవుడ్ భామలను తెచ్చుకుంటారు కానీ లోకల్ టాలెంట్ ని గుర్తించరు.
ఇదే విషయాన్ని ఈషా రెబ్బా ఇటీవల కుండబద్దలు కొట్టారు. తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఆఫర్స్ ఇవ్వడం లేదని వాపోయారు. వేరే పరిశ్రమల్లో టాలీవుడ్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే గర్వంగా ఉంటుంది. కానీ తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశం ఇవ్వరంటూ ఓపెన్ అయ్యారు. ఈషా రెబ్బా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.