గుండులో రష్మిక మందాన, వ్యాపారం కోసం షాకింగ్ లుక్!
స్టార్ హీరోయిన్ రశ్మిక మందాన జుట్టు లేకుండా గుండెలో కనిపిస్తే.. ఆమె అభిమానులు తట్టుకుంటారా. తమ వ్యాపారం కోసం రశ్మికను అందవిహీనంగా అలా మార్చేశారు కొందరు ప్రబుద్ధులు.
రష్మిక స్టార్ హీరోయిన్ గా టాప్ గేర్ లో దూసుకుపోతుంది. సౌత్ ఇండియా మొత్తం దాదాపు పరిశ్రమలలో అడుగుపెట్టిన ఈ చిన్నది, బాలీవుడ్ లో కూడా దండయాత్ర మొదలుపెట్టారు. రష్మిక బాలీవుడ్ లో రెండు చిత్రాలు చేస్తున్నారు.
సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను మూవీలో రష్మిక నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా షురూ అయ్యింది. దీనితో పాటు అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై మూవీలో రష్మిక అవకాశం పట్టేశారు.
పట్టిందల్లా బంగారం అన్న తీరుగా రష్మిక కెరీర్ సాగుతుంది. హైయెస్ట్ సక్సెస్ రేటుతో అందరి హాట్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయారు. ప్రస్తుతం రష్మిక చేతినిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
అన్ని చిత్రాలు ఒకెత్తు అయితే పుష్ప మరొక ఎత్తు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున తెరకెక్కుతుంది. ఈ మూవీలో రష్మిక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు.
అలాగే కొన్ని అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం రష్మిక పేరు పరిశీనలో ఉంది. 25ఏళ్ల ఈ కన్నడ అందం అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా పట్టేసింది. ఆఫర్స్ ఆమెకు కోకొల్లలుగా వస్తున్నాయి.
మరి ఇంత క్రేజ్ ఉన్న హీరోయిన్ గుండెలో కనిపిస్తే ఆమె ఫ్యాన్స్ మనసు ఏమైపోతుంది. అయితే తమిళ తంబీలు తమ వ్యాపారం కోసం రష్మిక గుండు ఫోటోలు వాడేస్తున్నారు.
తమిళనాడులో కొన్ని హెయిర్ సెలూన్స్ ఎదురుగా రష్మిక గుండు ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి. తమ వ్యాపార ప్రచారం కోసం వారు రష్మిక గుండు ఫోటోలు వాడుతున్నారు.
సాధారణంగా ఎవరైనా, ప్రమోషన్స్ కోసం అందమైన హెయిర్ స్టైల్స్ కలిగిన హీరోలు, హీరోయిన్స్ ఫోటోలు పెడతారు. దీనికి భిన్నంగా తమిళులు మాత్రం రష్మిక అందవిహీనమైన ఫోటోలు పెడుతున్నారు.
ఇక రష్మిక గుండు ఫోటోలు చూసిన మీమర్స్ రెచ్చిపోతున్నారు. రష్మిక మందాన యాంగిల్ లో మీమ్స్ రూపొందించి, హాస్యప్రియులకు ఆనందం పంచుతున్నారు.